సంవత్సరం క్రిందట ప్రచురితమైన “అమెరికా తెలుగు కథానిక 9వ సంకలనం (ప్ర.ప్ర.: అక్టోబర్ 2006) ” లో మహేష్ శనగల రాసిన “గుగ్గుళ్ళమ్మ గుడి” అనే కథ ఒకటి ఉంది. ఆ కథలో గూగులు, బ్లాగుల విశ్వరూపం మనక్కనిపిస్తుంది. కథ చెప్పే టోన్ lighter vein లో ఉంటుందనుకోండి, కానీ ఆ కథలో గొల్లపల్లె నుంచి అమెరికాకెళ్ళిన గీతమ్మ అనే పెద్దావిడొకామె తిరిగొచ్చాక తన గ్రామప్రజలందరికీ గూగులు, బ్లాగులు పరిచయం చేసి వాళ్లందరిచేత సొంతబ్లాగులు ప్రారంభింపజేసి, గ్రామ గూగుల్ సమితి ప్రారంభించి గ్రామస్థులకు అవసరమైన అన్నిరకాల సమాచారాన్ని గూగుల్‌తో లాక్కొచ్చి గ్రామపోర్టల్లో గుదిగుచ్చి, “బడ్డీకొట్లో బ్లాగు” స్కీము ద్వారా గృహహింస నుంచి పంచాయితీ అక్రమాల దాకా అన్నిటినీ జరిగిన తక్షణమే గ్రామస్థుల బ్లాగుల్లో ఏకిపారేయిస్తూ గ్రామస్వరూపాన్నే మార్చేస్తుంది. దాంతో గ్రామస్థులంతా కలిసి గూగుల్‌ని ఒక గుడిలో ప్రతిష్టిస్తారు. అదే గుగ్గుళ్ళమ్మ గుడి. ఆ గుడిలో దేవుడి బదులు శక్తివంతమైన వాయిస్ ఇంటర్ఫేస్ ఉన్న మాట్లాడగలిగే కంప్యూటరును ప్రతిష్టిస్తారు. ఏటేటా గుగ్గుళ్ళమ్మ జాతర వైభవంగా చేస్తారు. ఊరిపేరు గుగ్గుళ్ళపల్లెగా మారుతుంది.
—————————
అసలు ఈ కథ ఇప్పుడు గుర్తుకు రావడానికి కారణం తెలుగూరు అనే కొత్త గూగుల్ గుంపు. సమాచార విప్లవం నిజంగా సామాన్యప్రజల జీవితాల్లో మనం కలలుగనే మార్పులు తీసుకురాగలుగుతుందా?
(పైన రాసిన కథ, కింద రాసిన గూగుల్ హారతి ఈరోజు సందర్భవశాన గుర్తుకువచ్చినప్పటికీ వీలుచేసుకుని వాటి గురించి బ్లాగడానికి కారకులు, ప్రేరకులు మాత్రం కొత్తపాళీ గారే!)
చాన్నాళ్ళ కిందట ఒక బ్లాగులో “ఓం జై జగదీశహరే” బాణీలో చదివిన గూగుల్ హారతి:http://bijjam.blogspot.com/2006/04/google-aarti.html
(లిప్యాంతరీకరణ నేను చేశాను.)
ఓం జై Google హరే !!
స్వామి ఓం జై Google హరే
Programmers కె సంకట్, Developers కె సంకట్,
క్షణ్ మే దూర్ కరే!!
ఓం జై Google హరే !!
జో ధ్యావే results పావే,
దు:ఖ్ బిన్ సే మన్ కా, స్వామి దు:ఖ్ బిన్ సే మన్ కా,
Homework కీ సంపత్తి లే ఆవే, Homework కీ సంపత్తి లే ఆవే
కష్ట్ మిటె work కా,
స్వామి ఓం జై Google హరే !!
తుం పూర్ణ search engine
తుం హీ internet యామి, స్వామి తుం హీ internet యామి
పార్ కరో హమారీ MS, పార్ కరో హమారీ MS,
తుం internet కే స్వామి,
స్వామి ఓం జై Google హరే !!
తుం information కే సాగర్,
తుం పాలన్ కర్తా, స్వామి తుం పాలన్ కర్తా,
మై మూర్ఖ అజ్ఞానీ, మై Searcher తుం Server-యామి
సారా work తుం సే కర్తా !!
స్వామి ఓం జై Google హరే !!
దీన్ బంధు దు:ఖ్ హర్తా,
తుం రక్షక్ మేరే, స్వామి తుం ఠాకుర్ మేరే,
అప్నీ capabilities దిఖావో, సారే research కరో
Site పర్ ఖడా మై తేరే,
స్వామి ఓం జై Google హరే !!
Google దేవతా కీ ఆరతి జో కోయి programmer గావే,
స్వామి జో కోయి భీ programmer గావే,
కెహెత్ సునిలానంద్ స్వామి, భనత్ హరి హర్ స్వామి,
మన్వాంఛిత్ solution పావే.
స్వామి ఓం జై Google హరే !!
నిజానికి గూగుల్ కు అంత సీన్ వుందా? హైప్ కాక పోతే. ఇంటర్నెట్ అందుబాటులో వున్న డెవెలపర్ కమ్యూనిటి మహా అయితే ఇరవై శాతం వుంటారు. అందులో ఇంటర్నెట్ మీద పడి మాత్రమే బతికే అధమ స్థాయి డెవలపర్లు ఒక పది శాతం వుంటారు. వారి కీర్తనలే ఇవన్నీ.
ఇక గూగులమ్మ దేవత కూడా అలాంటి కాన్సెప్టే. గూగుల్ ప్రస్తుతానికి గ్రామ స్థాయిలో ఆలోచించే కంపనీ కాదు. కనీసం సమాచార విప్లవంతో కంప్యూటర్ని ఇంటింటా స్థాపించే వుద్దేశ్యమూ లేదు. ప్రస్తుతానికి ఈ పాట పాడుకుంటే మంచిది..
అంతా యాడు మయం
జగమంతా యాడు మయం
కాబట్టి ఇక కళ్ళు తెరచి మరో మైక్రోసాఫ్టు పుట్టకుండా జాగ్రత్త పడటం మంచిది.
గూగుల్ కంపెనీని ఆరాధించినా ధించకపోయినా, కనీసం భారతీయ నెటిజనులు విరివిగా వాడుతున్న శోధనయంత్రం గూగుల్. అంతర్జాలంలో Search అనే పదానికి Google అనేది పర్యాయపదంగా మారిపోయింది. గ్రామస్థాయిలో ఆలోచించకపోయినా భారతీయభాషలకు అంతో ఇంతో ప్రాథాన్యతనిస్తున్న బహుళజాతి కంపెనీల్లో గూగుల్ కూడా ఒకటి. కంప్యూటర్ని ఇంటింటా స్థాపించవలసిన పని మన ప్రభుత్వాలది. గూగుల్ నుండి కాక స్థానిక ప్రభుత్వాలనుండి సమాచార విప్లవాన్ని ఆశించడం సాధించుకోవడం అర్థవంతమైన పని అవుతుంది.
Good to see you back. Hope to see some original writing. Will comment more on this topic a bit later.
విభ గారు కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టుంది. WHile all of this is in fun .. one can’t ignore the fact that, fueled by the massive IPO and new frontiers of ad revenues still being explored, Google has already emerged into something of a juggernaut .. Even the opensource-loving nerds who shun MS like the plague dip into Google now and then .. certainly something to be thoughtful about .. Big Brother is Watching !!!
ఇలాంటి కథల్లోను, పేరడీల్లోనూ అతిశయోక్తులు సహజమేగా విభ గారూ!
గూగుల్ కి అంత సీను ఉందో లేదో కానీ బ్లాగులకి, ఇంటర్నెట్టుకూ అంత సీనుందని నా ‘ఘాట్టి’ నమ్మకం 🙂
అవును భారతీయులు విరివిగానే వాడుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ తేల్చి చెప్పింది. మనోల్లు తెగ దొరక్క కొట్టుకు వెతుకుతున్నది “sex” అంట.
ఎంత అతిశయోక్తిగా తీసుకున్నా తెచ్చి నెత్తిన పెట్టుకోవటం మంచిది కాదు. OS మార్కెట్లోనికి రాకుండా గూగులు మన భారత దేశానికి ఏ సాయమూ చెయ్యలేదు.
విభగారు, మీరు దురుసుగా చెప్పినా అది నిజం. మనోళ్లు వెతుకుతున్నది మాత్రం దొరక్కనే 🙂 సరేలే ఎవరైనా వెతికేది దొరకనిదాన్నేకదా అనుకుందామంటే, ‘జిహాద్, తాలిబాన్’ వంటివి పుష్కలంగా ఉన్నా పాకిస్తానీయులు వాటినే ఎందుకు వెతుకుతున్నారో మరి!?
ఇంటర్నెట్ గ్రామీణులకు ఉపయోగకరంగా ఉండాలంటే ముందు కంప్యూటర్ వాడుకరి పరాయి భాషమీద ఆధారపడే అగత్యం ఉండకూడదు. OS దగ్గర్నుంచీ అన్నీ తమ మాతృభాషలో ఉన్నప్పుడే అది సాధ్యం. గూగుల్ ఆ దిశగా ఏమీ చెయ్యడం లేదు. ఐతే రానారె చెప్పినట్లు “భారతీయభాషలకు ప్రాథాన్యతనిస్తున్న బహుళజాతి కంపెనీల్లో గూగుల్ కూడా ఒకటి”. అంతమాత్రాన “గ్రామస్థులకు అవసరమైన అన్నిరకాల సమాచారాన్ని గూగుల్‌తో లాక్కొచ్చి గ్రామపోర్టల్లో గుదిగుచ్చా”లంటే అందుకవసరమైన సమాచారం సమగ్రంగా ఇంటర్నెట్లో లభ్యమయ్యే అవకాశాలు మృగ్యం. ప్రస్త్తుతం గ్రామాల మాటటుంచి మండలాలకే వెబ్సైట్లు లేవు. ప్రతి జిల్లాకూ ఒక వెబ్ సైట్ మాత్రం ఉంది. కానీ ఆ వెబ్ సైట్లను రూపొందించినవారికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల వివరాలు వినా కనీసం జిల్లా స్థాయిలో ఈ రకమైన సమాచారం అందివ్వొచ్చనే ఆలోచన వచ్చినట్లు లేదు. 😦
(ఆ హారతి కేవలం నవ్వుకోవడానికి రాసింది. )
నాకో మెయిలు రాయండి. ధన్యవాదాలు.
you right think ya;thank you