Feeds:
టపాలు
వ్యాఖ్యలు

నవంబరు గడి

ఈసారి ప్రొఫెసరు గారు ఇచ్చిన గడి “చాలా ఖష్ఠంగా” ఉందని భక్తులు అంటున్నారు కాబట్టి సులభంగా ఉన్నచోట మొదలుపెడదాం:

28. అడ్డం: ఈమె కలానికి ఎదురు లేదు. పదునైన తన కలాన్నే కత్తిలా వాడి కల్పవృక్షాన్నైనా, తులసీ దళాన్నైనా ఇట్టే నరుకుతారు.

29. నిలువు: ఇంత ముద్ద దొరికిందీ? మీకు హిందీ కూడా వచ్చినట్లైతే కుచ్ మజ్జిగా పూఛో జీ!

21. నిలువు: పొగడ్తల్లో మునగబోయి ఈ చెట్టెక్కారా? బాగుంది సంబడం.

21. అడ్డం: వేగంగా (త్వరగా?) వెళ్ళేది కాబట్టి గుర్రానికి ఈ పేరు వచ్చిందట.

25 ఇంకా నయం. సాగదీస్తే నామంలా కనిపిస్తుంది అన్లేదు.

22, 23 నిలువులు కూడా ఇప్పటికే వచ్చేసుండాలే? ఇక ప్రొసీడైపోండి.

ప్రకటనలు

నేనొచ్చేశా…

…పురజనుల కోరిక మేరకు. 🙂 పొద్దు గడికి స్లిప్పుల సర్వీసు బయలుదేరుటకు ప్లాట్ఫారమ్మీద సిద్ధంగా ఉంది. కూఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊ చుక్ చుక్!!!

అడ్డం 1: పొద్దుకొచ్చి పొద్దుపోయిందంటారేమిటి గొల్లపూడి గిరీశం గారు! (6)

గిరీశం డవిలాగే గొల్లపూడి మారుతీరావు నవల పేరు.

అడ్డం 15: అరగజం దూరంలో, అదిగో పెద్ద కొండచిలువ! (4)

అరగజం అంటే పొడుగెక్కువైపోలే? ‘తోక’ను మింగేసి తల కదల్చకుండా శరీరాన్ని తలకిందులుగా కొలిచిచూడండి.

అడ్డం 8: తిన్నది తాపీగా అరిగించుకోండి (3)

అది అందరికీ సాధ్యమా? ఏ అగస్త్యుడో రావాలి బాదామి కొండ దగ్గరికి. అప్పుడే అది “జీర్ణం జీర్ణం…” అయ్యేది.

నిలువు 3: కర్పూరవసంతరాయలి ప్రేయసిదే కులమయితే నేమి? (3)

గతంలో కూడా ఈమె పొద్దు గడిలో వయ్యారమొలికించింది. చూడబోతే ఈమె మీద గడి కూర్పరులు బాగానే మోజుపడ్డట్టున్నారు! 😉

ప్రొఫెసరు కొవ్వలి సత్యసాయి గారికి సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, లాంటి లలిత కళలన్నింటిలో ఆసక్తి ఉన్నా సంగీతం ముందు మరేదీ నిలవదనుకుంటా. ఆయన కూర్చిన గడి తెరిస్తే చాలు శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతం “దర్శనమిస్తుంది”. ఈ నెల గడిలో సంగీత సంబంధ ఆధారాలతో మొదలుపెడదాం:

అడ్డం:

9. దశ ల స్థానాలు మార్చాం. అయినా ఇలాంటి నదిలో స్నానం బెటరా రాముని సన్నిధి బెటరా అని త్యాగయ్య గారికి డౌటే డౌటు.

నిలువు:

4. ఎనిమిది ఏనుగుల్లో ఒకాయనా? సంగీతరహస్యాలు తెలుసటగా!
45. షడ్జం.

వీటిలో నిలువులు సులభంగానే వచ్చేశాయి. (మనలో మాట: 4 నిలువులో ఆయనకు సంగీత రహస్యాలు తెలుసన్న విషయం నాకూ ఇప్పుడే తెలిసింది. ఎంతైనా మనకు మను చరిత్ర తెలిసినంతగా వసుచరిత్ర గురించి, అది రాసినాయన గురించి తెలియదు కదా? 🙂 )

5 నిలువు మీకు తెలియకపోతే భైరవద్వీపం సినిమాలో “శ్రీ తుంబుర నారద నాదామృతం” పాట ఒకసారి శ్రద్ధగా వినండి.

9 అడ్డం: ఆ నది ఏమిటో నాకూ తెలియదు. ఎవరైనా ఒక స్లిప్పు పంపండి, ప్లీజ్!

ఈ టపాకు టైటిలు భలే ఉంది కదా? అది ‘బ్లాగాడిస్తా’ రవి గారు సూచించారు. ఏప్రిల్, మేలలో ఎండలు మండుతాయి. బహుశా ఆ ఎండల వేడిమి గడి కూర్పరులకు బాగా తగిలినట్లుంది. గడి మే లో కొంచెం కష్టంగా, జూన్ లో మరీ కష్టంగా, రవి గారి మాటల్లో చెప్పాలంటే ఒకటి కదళీపాకంలో ఉంటే ఇంకొకటి నారికేళపాకంలో ఉంది. 😦 ఈసారి ఋతుపవనాల చల్లదనంతో కాబోలు గడి కూడా (ఆ రెండు నెలలతో పోలిస్తే) సులభంగానే అనిపిస్తోంది. ఈసారి సాధకుల మొదటి ప్రశ్న 45 అడ్డానికి ఆధారంలో నాలుగక్షరాలుంటే గడిలో ఒక గడే ఉందేమని? అన్నట్టు భక్తులకు 1, 4, 44, అడ్డాలు వచ్చాయా? నాకైతే ఈ నాలుగు పూసల్లో ఒకే దారం కనిపిస్తోంది. మీరేమంటారు బ్లాగ్వీరులారా!

గడి లింకు: http://poddu.net/gadi/crossword.php

జూన్ గడి

మే గడి సులభంగా ఉందని ఒకరికిద్దరు అనడం వల్లనో ఏమో సార్లు ఈ గడిని ‘బిగిం’చినట్లున్నారు. ఈసారి గడి వాలకం చూస్తే నాకు ఫలానా ఫలానా ఆధారాలకు స్లిప్పులు కావాలని అడగడం కంటే నాకు ఫలానా ఆధారాలకు మాత్రమే సమాధానాలు తెలుసు అని చెప్తే మిగిలిన అన్ని ఆధారాలకు స్లిప్పులు కావాలని భక్తులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. అన్నట్లు గడి లింకిదిగో: http://poddu.net/gadi/crossword.php

తక్షణం నేనివ్వగల స్లిప్పులు:

13 అడ్డం: వినగానే అచ్చతెలుగులో ఆభరణం అనిపిస్తుంది.

15 అడ్డం: పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికలు తిరిగే నాలుక. (చిన్నప్పుడు విన్న పొడుపు కథ)

43 అడ్డం: ఆ కోపధారి ఒక్కటిచ్చుకుంటే ఇచ్చుకున్నాడుగానీ ఆనందంతో “జలకాలాటలలో, కలకలపాటలలో ఏమి హాయిలే హలా” అని పాడాలనిపిస్తోంది. ఎంతైనా ఆయనా జగదేకవీరుడే కదా? 😉

45 అడ్డం: ఈ సింహాలు, నక్కలు ఏమిటండీ బాబు, తొందరగా “వురుకో” వురుకు పొట్టపట్టుకుని.

47 అడ్డం: “గంజాయి దమ్ము బిగించి కొడితే … ఆపై <> కిళ్ళీ నమిలితే … ” ఏం గొడ్తె వస్తది భయ్ ఆ కిక్కు?

17 నిలువు: చెప్పేద్దును గానీ, చెప్పావులేవోయ్ అనిపోతారు మీరే. (డవిలాగు రైటు: విహారి గారు)

21 నిలువు:anagram

26 నిలువు: కడుపులో కూడా చిన్నా, పెద్దా తేడాలుంటాయి మరి 🙂

గడి గడువులో రోజులు కరిగిపోయి గంటల్లోకి వచ్చేసింది. ఈసారి కూర్పరి భైరవభట్ల కామేశ్వరరావు గారు. గడి చాలా వీజీగా ఇచ్చామని వారన్నారు. పొద్దుపెద్దలు చాలా ఉదారంగా “కాఫీ బెల్లు” ప్రకటించేసి కళ్లు మూసుకున్నారు. ఐనా ఎక్కడా చడీ చప్పుడూ లేదేమి చెప్మా? మరి మాస్ కాపీయింగు చాపకిందనీరులా నిశ్శబ్దంగా సాగిపోతోందనుకోవాలా? ఏమీ అర్థం కావడం లేదు. నా బ్లాగులో కిందటి నెల గడి గురించి రాసిన టపాలో సుజాత గారు అడిగిన/ఇచ్చిన ఆధారాలు ఇక్కడ ఇస్తున్నాను. రేసులో వెనుకబడ్డవాళ్ళు ఇవి అందుకుని అల్లుకుపొండి.

28 అడ్డం: పక్షీంద్రుడు. పేరుకు రాజైనా విష్ణుమూర్తికి బంటేనటండీ, పోతరాజు చెప్పాడు.

33 అడ్డం: “రోములో ఉన్నప్పుడు రోమంగాడిలా పలకమన్నారు” కదా? ఇంతకంటే ఎక్కువ చెప్తే ఎంత టీ తాగుతున్నా ఇన్విజిలేటర్లు ఊరుకోరేమో!

28, 33 అడ్డం వస్తే 19 నిలువు వచ్చినట్లే కదా? ) అలాగే 29 నిలువు కూడా!

4 అడ్డం (దీనికి సగం అక్షరాలు కలిసాయి) అబ్బూరివారి పేరు చెప్పి గూగులమ్మను అడిగి చూడండి.

20 అడ్డం..! ‘వాణి నా రాణి ‘ అన్నాడీయన. శివుడి అనుచరుడే!

43 పెద్ద శబ్దం

పొద్దులో గతంలో సత్యసాయి గారు కూర్చిన గడికి విశేష స్పందన లభించింది. పాఠకులందరూ ఉత్సాహంగా పూరించి పంపారు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సత్యసాయి గారు కూర్చిన గడి ఇప్పుడొచ్చింది. ఎంతమంది ప్రయత్నించారో, వారిలో ఎంతమంది పంపించారో తెలియదు. పోయిన్నెల్లో లా కాకుండా ఈ గడి గురించి ఎక్కడా గుసగుసలైనా వినబడడం లేదు. బహుశా పొద్దు పెద్దలు “మాస్ కాపీయింగ్” అంటారని జంకుతున్నారేమో తెలియదు. 🙂 ఏమైతేనేం? ఈసారి పిల్లి మెడలో గంటకట్టే అవకాశం నాకొచ్చింది. గడి గడువు కూడా దగ్గరపడుతోంది కాబట్టి కట్టేస్తున్నా. 🙂

ముందుగా ఇవి ‘చెప్పాలని ఉంది’! (కశ్యప్ గారిలా కబుర్లు కాదండోయ్!):

అడ్డం:

28. పేరులో ఈశ్వరుడున్నాడు కానీ ఆగర్భశ్రీమంతుడు. అందుకే దాక్కున్నాడు. (6)

నిలువు:

33. విష్ణుమూర్తే. ముందే విష్టా ఉన్నవాడు. తర్వాతే చెవి ఉన్నవాడు. (6)

ఈ రెండు ఆధారాలకూ సమాధానాలు బ్రౌణ్యములోనే దొరుకుతాయి తెలివిగా వెదికితే! (నాకు దొరికాయని భావము. 🙂 )

(ఈ బ్లాగులో టపాలు రాసి చాలాకాలమైంది. కూడలిలోంచి గెంటేస్తారేమో అని అనుమానించి ఇలా టపా కట్టేశా!)