సుగాత్రి నా కలం పేరు. సుగాత్రి అంటే మంచి గాత్రం గలది అని అర్థం. అంటే శ్రావ్యమైన గొంతన్నమాట. కానీ నా గొంతు అంత బాగుండదు. పాటలంటే చచ్చేంత ఇష్టం. మైమరచి వినడమే గానీ పాడేంత సాహసం చెయ్యలేను. సాహిత్యమంటే ప్రాణం. అందుకే ఈ బ్లాగు తయారుచేసుకున్నాను. కానీ ఏమీ రాయలేకపోయాను. సినిమాలన్నా నాకిష్టమే. ఈ మధ్య కొందరు స్నేహితులు నన్నేమైనా రాయమని పోరుతున్నారు. కొంపదీసి రాసినా రాసేస్తానెమో! అదే జరిగితే పాఠకులు నా రాతలను ఎలాగోలా భరించాలని మనవి.
మీరు చాలా బాగా రాస్తున్నారు. ఇలాగే బ్లాగులో పాడాలని మా మనవి.
ఇంతకీ మీ అసలు పేరు, వృత్తి, ఉండే చోటు ఇవేం చెప్పలేదు..
శోధన గారూ! నా గొంతు వింటే మీరు పారిపోతారండీ!
స్వాతి గారూ! కొంతకాలం ఓపిక పట్టండి!
మా నాన్నగారి అనువాదాలను ఎవరూ ప్రచురించలేదు. గోగొల్ రాసిన డెడ్ సోల్స్ నవలను మృతజీవులుగా ఆయన రాశారు. దాన్ని ఈమాటలో ప్రచురించడం మొదలుపెట్టి మరీ పెద్దదిగా ఉందనో ఏమో మధ్యలో ఆపేశారు. వెబ్ లో ఎక్కడో అక్కడ ఆయన అనువాదాలను పోస్ట్క్ చెయ్యాలని ఉంది.
సుగాత్రి అంటే మంచి శరీరము కలది, అని ఆమధ్యన దీప్తి ధార లో చదివాను. బ్లౌణ్యంలో కూడా గాత్రము అంటే శరీరము అని వ్రాసుంది.
రాకేశ్వరరావుగారూ!
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. గాత్రము అనే సంస్కృత (తత్సమ) పదానికి మీరు చెప్పిన అర్థం, దేశ్య పదానికి నేను చెప్పిన అర్థం ఉన్నాయి.
గాత్రసంగీతమంటే గొంతెత్తి పాడేదనుకుంటా. క్షతగాత్రులు అనే సమాసంలో గాత్రమంటే శరీరమనే అర్థం.
సుగాత్రిగారు, మీరు మాకు తెలిసిన సుగాత్రి గారేనా..? టి.పి లో కలిసాము ..?
త్రివిక్రమ్ గారూ!
నెనరులు.
kamal గారూ!
క్షమించండి. మీరెవరో నాకు తెలియదు. టి.పి. వైపు నేనెప్పుడూ రాలేదు.
త్రివిక్రం గారు,
క్షతగాత్రులంటే ఇప్పుడు తెలుసు గానీ చిన్నప్పుడు వార్తల్లో ప్రమాదంలో క్షతగాత్రులు అని విని (గాత్రమంటే కేవలం గొంతు అనుకుని) గొంతులు తెగి పడ్డ వాళ్ళనుకునే దాన్ని!
edo prabandha sahityam lo sugathri – salivahanula gurinchi chadivinattu gurthu. Sugathri ante manchi roopasi ani artham vundi.
–Cine Valley
Cine Valley గారూ,
నెనర్లు. మీరు చెప్తున్న ప్రబంధం పింగళి సూరన రాసిన కళాపూర్ణోదయం. సుగాత్రీ-శాలీనుల (శాలివాహనుడు కాదు) కథ అందులోదే. మీకు తెలుగులో రాయడమెలాగో తెలియకపోతే లేఖిని (http://lekhini.org) తో ప్రారంభించండి.
సుజాత గారూ!
meeru chaala baaga rastunnaru. mimmalani choosi nenu kuda raste ela vuntundhi ani choostunna. mee abiprayam ento cheppandi data chesi
Namasthae andariki,
Naku telugu antae chala istam. Nenu telugu chadavagalanu kani vraya lenu. Meelo evarina naku telugu vrayadam nerputhara.
Naa peru kooda sugathri . EE blog chaala baavundi… telugu chaduvutunte hayiga undi.
ఇది స్లిప్పుల సర్వీసు బ్లాగులో రాసిన వ్యాఖ్య. మీ కృషినుద్దేశించి ….మీరూ అందులో భాగస్వాములన్న భావనతో …
అన్యాయం- ఏకంగా స్లిప్పుల సర్వీసుకోసం ఓబ్లాగే పెట్టేయడం. వా…. ః)
ముంబైలో లోకల్ ట్రైన్స్ లో మరాఠీ పేపరులో క్రాస్వర్డు ఒంటికాలి మీద నుంచుని, చేసేవాళ్ళు కనిపిస్తారు – రెండుకాళ్ళమీద నుంచునేంత చోటుండదుగా మరి!. మీరు గడికి అలాంటి ఫేన్ ఫాలోయింగ్ తీసుకొస్తున్నారు. అభినందనలు. ఆల్ ది బెస్ట్.
ప్రొఫెసరు గారికి వందనాలు.
లేదండీ. నా నుంచి ఉలుకూ పలుకూ లేకపోయేసరికి ఆ బ్లాగు జ్యోతి గారే మొదలుపెట్టారు. నెనర్లు.
BAGUNDHI
NAKU THELUGANTE ISTAMNDI NAKU KUDA ME BLAOGU LO KALAVALNI UBDHI