ఈసారి ప్రొఫెసరు గారు ఇచ్చిన గడి “చాలా ఖష్ఠంగా” ఉందని భక్తులు అంటున్నారు కాబట్టి సులభంగా ఉన్నచోట మొదలుపెడదాం:
28. అడ్డం: ఈమె కలానికి ఎదురు లేదు. పదునైన తన కలాన్నే కత్తిలా వాడి కల్పవృక్షాన్నైనా, తులసీ దళాన్నైనా ఇట్టే నరుకుతారు.
29. నిలువు: ఇంత ముద్ద దొరికిందీ? మీకు హిందీ కూడా వచ్చినట్లైతే కుచ్ మజ్జిగా పూఛో జీ!
21. నిలువు: పొగడ్తల్లో మునగబోయి ఈ చెట్టెక్కారా? బాగుంది సంబడం.
21. అడ్డం: వేగంగా (త్వరగా?) వెళ్ళేది కాబట్టి గుర్రానికి ఈ పేరు వచ్చిందట.
25 ఇంకా నయం. సాగదీస్తే నామంలా కనిపిస్తుంది అన్లేదు.
22, 23 నిలువులు కూడా ఇప్పటికే వచ్చేసుండాలే? ఇక ప్రొసీడైపోండి.
మరీ అంత కష్టంగా ఉన్నట్టు లేదండీ. 1 అడ్డం, 3 నిలువు, 17 అడ్డం తప్ప మిగిలినవి అయిపోయాయి.
24 నిలువు. బావ – మరదలు బంధుత్వం
39 అడ్డం. లంచం ని ఇప్పుడు ఇలా అంటున్నారా
34 నిలువు. “మరువం” కి మరోపేరు
36 నిలువు. పూరీలు లాటిదే
–సూర్య ప్రకాష్
1 అడ్డం జాతిపిత అనుకుంటా
1,3 addam, 32,
11 niluvu takka anni vachchesaayi.
koncham slippulichchi punyam kattukondi baboooo……….
హలో సుగాత్రి గారు నేను మళ్ళీ వచ్చా
ఈజీగా ఉందా నాకైతే చాలా చాలా కష్టం గా ఉందనిపిస్తోంది
24 నిలువు కులమతాలు నా? కానీ సూర్యప్రకాష్ గారు ఇచ్చిన దాని ప్రకారం “మేనరికాలు ” అనే అర్ధం వస్తోంది??
21 అడ్డం “బడబము ” నా?
45 అడ్డం చిన్న చిన్న ఇబ్బందులు అంటే?
3 నిలువు శ్రీసాయిసచ్చరిత్ర నా?
17 అడ్డం ఈవీ అంటే ? గూగుల్ లో వెతికితే దయ /దానం అనే అర్ధాలు వచ్చేటట్టు ఉన్నది. నాకు అర్ధం కావటం లేదు
@suryaprakash ,krishna 1 అడ్డం వచ్చి “మున్నాభాయ్” కదండి ?
please tell me how to write in telugu script in this box.
ayya baaboi gadi ki slippula baagootam guuda undaa,,,
Esangati ippude naaku telisindi.aitee vijeetalu challa mandi
untaaranukuntaa. sare chuddam<
3 addam mariu niluvu enta gijukunna klu dorakaleedandi. koncem klu icci aadukondi please
nEnu ikkada oka post vesaanu kanabadatam lEdEmiTi?:-?
bhaskernaidu garu,,
తెలుగులో రాయడానికి http://lekhini.org/ ఉపయోగించండి.
భాస్కర్ నాయుడు గారు,
మీరు http://www.lekhini.org కి వెళ్ళి అక్కడ పైన ఇంగ్లీష్ తో టైప్ చేస్తే కింద మీకు తెలుగులో కనిపిస్తుంది. అక్కడ కట్ చేసి గడి లో పేస్ట్ చెయ్యడమే! సుగాత్రి గారి పుణ్యమా అని ఈ స్లిప్పుల సర్వీసు మొదలైంది …ఉపయోగించుకుని మీరూ విజేతలుగా నిలవండి. మీరూ మాకు స్లిప్పులిచ్చే షరతు మీద….
3 నిలువు షిరిడీ సాయి సచ్చరిత్ర రాసినాయనే!
11 నిలువు…..అదేనండి! “ఇంతే…..చిత్తగించవలెను..”
konchem veeTiki evarainaa chepparaa please…
7 aDDam alappayudE anTE?
3 niluvu “a” tO modalavutundaa?
3 aDDam kooDaa teliyaTam lEdu
45 aDDam prayaaNam lO chinna chinna ibbandulu anTE?
సుజాత గారు, ౩ అడ్డం ,నేను అదే అనుకున్నా కాని ఆ పేరు కరెక్టుగా సరిపోవట్లేదే?? మధ్యలో పేరుని ఏమన్నా కుదించారా?? కుదిస్తె సరిపోతున్నట్టే ఉందే
శ్రీలు గారు, “అలప్పాయుతే కన్నా” అని ఒక తమిళ భక్తి పాట ఉంది( సినిమా పాట్ కూడా ఉంది, సఖి సినిమా తమిళ్ వర్షన్ లో). అలప్పాయుతే అంటే “అలై పొంగెరా” అని అనుకుంటాను అర్థం. దీన్ని బట్టి అక్కడ ఏమి రాయాలో మీరే ఆలోచించండి
45 addam “padanisalu” anukuntaa
శ్రీలు,
7 అడ్డం…ఆ పాటలో దైవానిక చెప్పిన వాక్యం తర్వాత వచ్చే రెండక్షరాలూనూ!
3 నిలువు…అవును, అ తోనే మొదలవుతుంది. సాయి సచ్చరిత్ర రాసినాయన అసలు పేరు అది.
3 అడ్డం…అదే ఆలోచిస్తున్నా(ఇది స్లిప్పు కాదు)
45 అడ్డం…సరిగమల తర్వాత వచ్చేవి…
లచిమి…డైరెక్టుగా ఇవ్వడం కుదరదమ్మాయి స్లిప్పు….దానికీ క్లూ ఉండాలి. అప్పుడే మజా!
sarenandeee sujatha gaaru copy ivvakoodadannamaata slippule ivvalannamaataa
3 అడ్డం… ????
ప్రొఫెసరు గారు ప్రవాసం లో ఉంటం వల్ల తెలీక “ఇలాంటప్పుడు” కూడా”ఈ నామం” అన్నారు గానీ, ఆంధ్రలో “అలాంటప్పుడు” ఆ నామం ఎప్పుడొ వదిలి పెట్టి ఆయిల్ పెడతా రా అని మైకుల్లో హోరెత్తిస్తున్న వారి వైపు పరుగులు పెడుతున్నారు
బోలెడు ధన్యవాదాలు సుజాత గారు ,లక్ష్మి గారు , దైవానిక గారు
24 నిలువు కులమతాలు నా? కానీ సూర్యప్రకాష్ గారు ఇచ్చిన దాని ప్రకారం “మేనరికాలు ” అనే అర్ధం వస్తోంది??

27 అడ్డం”పనస” ? కానీ గడులు సరిపోవటం లేదే
25 ,8 అడ్డాలు 16 నిలువు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు
23 నిలువు “అరయం” అంటే?
46 అడ్డం “కత్తెర ” నా?
బోలెడు ధన్యవాదాలు సుజాత గారు ,లక్ష్మి గారు , దైవానిక గారు
24 నిలువు కులమతాలు నా? కానీ సూర్యప్రకాష్ గారు ఇచ్చిన దాని ప్రకారం “మేనరికాలు ” అనే అర్ధం వస్తోంది??
27 అడ్డం”పనస” ? కానీ గడులు సరిపోవటం లేదే
25 ,8 అడ్డాలు 16 నిలువు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు
23 నిలువు “అరయం” అంటే?
46 అడ్డం “కత్తెర ” నా?
ఊకదంపుడు గారు, అమ్మో! నిజమే!
శ్రీలు,
24 అడ్డం సూర్యప్రకాష్ గారిచ్చిన క్లూ ప్రకారమే కరక్టు!
27అడ్డం కరక్టే, సరిపోతాయి చూడండి,బహువచనం వాడండి.
8 అడ్డం…అక్కినేని గారి సినిమా! భానుమతి పాట కూడా ఉందిగా..”ఓ—-ననూ మరువకోయీ” అడ్డదిడ్డంగా రాసి చూడండి.
25 అడ్డం: మొదటి అక్షరం వాడుక లో మాట్లాడినట్లు “ల” కాదు, “న”! ఇప్పుడు వస్తుందేమో చూడండి.
16 నిలువు: “క” భాష అంటే తెలుసుగా మీకు. ఏదైనా మాటలో ప్రతి అక్షరానికీ ముందు “క” చేర్చడం! మీ పేరుని “కశ్రీకలు” అంటారు. ఈ లెక్కన ప్రయత్నించండి.
23 నిలువు: స్పీడు.
46 అడ్డం: కాదు.
సుజాతగారు, చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇచ్చిన క్లూలబట్టి వచ్చినాయి. కానీ 25 అడ్డం మటుకు అర్ధం కాలేదు “న” తోనే మొదలవుతుందని తెలుసు కానీ…
21 అడ్డం “గడబము” నేనాండి?
కాస్త ఆ చేత్తోనే 38 నిలువు కి ఏమైనా క్లూ ఇవ్వరూ..
21 aDDam adi kaadu…… vEgamgaa parugettagaladi kaabaTTi gurraaniki aa pEru vacchindi.
25 aDDam ya ku chinna sunnaa istE emavutundi…. konchem namaskaaramunu talapistOndi kadaa..
శ్రీలు గారు, మీరు తప్పుగా అనుకోక పోతే ఒక్క మాట. ఇక్కడ మీరు సమధానాలు బహిరంగంగా “ఇదేనా” అని అడగడం ఏమి బాగోలేదు. కావలిస్తే స్లిప్పులడగండి. సమాధానాలు డైరెక్టుగా అడగడం వలన, ఈ స్లిప్పుల సర్వీసు కాస్త కాపీ సర్వీస్ గా మారొచ్చు. కాబట్టి మనందరం ఇక్కడ సమాధానాలు కాకుండా స్లిప్పులడిగితే బాగుంటుందని నా అభిప్రాయం.
21 అడ్డం: ‘తరిగి’న దానికి మొదటికే కొమ్మొస్తె గుర్రమే అవుతుంది
25: ఇంకా ‘నయం’, మేలే అంటున్నారు కదండి.. అందులో పెద్ద సున్నా బదులు చిన్న సున్నా అంటున్నారు. ఇక రావాల్సిందే
46 అడ్డానికి, 32కి సంబంధం ఉంది. ఇక్కడ కటింగ్ అంటే క్షౌరం కాదండి.. బడాయి కటింగ్
ayyo 38niluvu, 46 addam raavadam ledu.
aa rendu vaste 32 vastundi.
koncham saayam cheyyarU…
కృష్ణ గారు,
32 నిలువు సులభమే! విఘ్నేశ్వరుని మొహాన్ని ప్రార్తించండి.
46 అడ్డం…క్షవరం కాదని దైవానికి స్లిప్పిచ్చారుగా! ‘—–చెయ్యకురా భాయి” అంటుంటారుగా మన హైదరాబాదు పోరగాళ్ళు!
ఇవి వచ్చాక ఏకాక్షరం కనుక్కోండి చూద్దాం!
కృష్ణ గారు,
నేనిచ్చిన క్లూ 31 అడ్డానికి సంబంధించింది.32 కాదు. 46 అడ్డం క్లూ ఇచ్చానుగా. అదొస్తే 32 ఏకాక్షరం ఈజీగా వస్తుంది. చూడండి.
hyd vadali dadaapu 9 ellu ayyindi.katting ante strike kaavatam ledu. pls help
ఓ సారీ అండి దైవానిక గారు ఇక నుండి అలా డైరెక్టుగా అడగనులేండి.
మీరు ఇచ్చిన క్లూ ప్రకారం వచ్చినట్టే ఉంది కానీ కొంచెం కంఫ్యూజింగా ఉంది
31 అడ్డం వచ్చి “ఏనుగు” అని అర్ధం వచ్చేటట్టు వచ్చింది ఇది కరక్టేనా? ఎందుకంటే ఇది వస్తే 38 నిలువు వస్తుంది కదా? (ఇలా అడగొచ్చు కదా? )
43 నిలువు “దినసిచే ” అంటే?
46 అడ్డం తట్టటం లేదు
శ్రీలు గారు, భేషుగ్గా అడగొచ్చు.
31 అవును ఏనుగే
43, తిరగేస్కోండి
46, ఆ దినకరుడ్ని ప్రార్థీంచండి, ఠక్కున తడుతుంది
దైవానిక గారు ——- ఇది చేస్తే నరాలు తీస్త బిడ్డ అని ఝాన్సీ ఒక సినిమాలో బెదిరిస్తుంది అదేనా 46 అడ్డం ?
3-నిలువు కి కాస్తా సాయం చెయ్యరు
అలాగే రెండు నిలువు కి కూడా
ఆ చేత్తోనే నాలుగు నిలువు కూడా చెప్పేద్దురు
దైవానిక గారు
46 అడ్డం , 38 నిలువు కొంచెం క్లూస్ ప్లీజ్
లచ్చిమి,


నాకు ఆ డైలాగు తెలీదు గాని, ఈ పదం పెడితే డైలాగు అదిరింది
3 నిలువులో శ్రీ సాయి సత్చరిత రాసినాయన ఉన్నాడు. అతని పేరు ‘అన్నా’తో మొదలవుతుంది
2 నిలువు, చివరి మూడక్షరాలు క్లూలోనే ఉంది. మగవాడికి అన్నని(మాఫియా డాన్ ని కూడా) హిందిలో ఏమంటారో మొదట్లో పెట్టేయండి.
4 నిలువు, నాకు కూడా కాస్త అనుమానంగానే ఉంది. పదిలానికి వేరే పదం చివరి రెండక్షరాలు. మొదటిది చెప్పడానికి ‘సిగ్గు’పడక్కర్లేదనుకోండి
స్వరూప్ కృష్ణ గారు, పైన లచ్చిమి గారు చెప్పినదేమైనా పనికొస్తుందేమో చూడండి
38 నిలువు ఇంకా తట్టలేదండి
38 నిలువు మొదటక్షరం వచ్చేస్తే నా గడి పూర్తయినట్లే! దయ గల తల్లులు/తండ్రులు ఈ ఒక్క స్లిప్పిస్తే వారు,వారి కుటుంబం సుఖ శాంతులతో వర్థిల్లుదురు గాక!
సుజాత గారు, ఐతే 43 అడ్డానికి ఒక స్లిప్పిచ్చి పుణ్యం కట్టుకోండి. అప్పుడు ఆ మొదటక్షరమొస్తుందేమొ చెప్తాను.
38 నిలువు- అధారం తప్పేమో , 32 తో ఉంటే బట్టలు లేని వాడె అని ఉండాలనుకుంటా
swarup gaaru 1 addam cheptaaraa kaasataa last moodu aksharaalu telusu modati aksharam teliyatam ledu
mariyu 43 addam koodaa pleasee
లచ్చిమి గారు, 1 అడ్డానికి సంజెయ్ దత్తుని తలుచుకోండి
munnabhai alaa ite 1 niluvu raadu gaaa
1 niluvu america president ye kadaaaa
స్వరూప్ గారు, అదే అయ్యుంటది. ఇప్పుడు ఆధారం సరిగ్గా సరిపోయింది. నేను 31అని ఎంత ఆలోచించినా ఏమి రాలేదు. 32 అనగానే ఠక్కున వచ్చింది. ఆశ్చర్యంగా 43 కూడా కలిసింది.
43 అడ్డానికి ఒక క్లూ. అది మన సరిహద్దు దేశం పేరు కూడా
32 TO PILICHE OKA DEVUDU SOORYAARAO GAARU RENDO DEVUDU GAARU EVARU????
లచ్చిమి, 1 నిలువులో కంగ్రాట్స్ కూడా ఉండాలి కదా
.. ఉత్త ప్రెసిడెంట్ అయితే లెక్క కూడా సరిపోదు
లచ్చిమి, ఇంకో దెవుడు కేవలం దిక్కులనే బట్టలుగా వేసుకుంటాడు
1 niluvu —mari last moodu akshaaralu US president name to saripotunnnaye
దైవానిక,
బాబూ నేను అది కూడా ఆలోచించి పెట్టాను. అందుకే 46 అడ్డానికి కలిపి చూశాం కదా! మరి 38 నిలువు దిక్కులనే అంబరములుగా ధరించిన వాడులో మొదటి అక్షరం లేకుండా వస్తుంది. అప్పుడు 32 కలిపితే సరిపోతుంది. మరి 38 నిలువు లో మొదటి అక్షరానికి అర్థం 31 అడ్డం యేనా కాదా?
38 నిలువు ఆధారం లో- 31 బదులు 32 ఉండాలి. సరిచేసుకోండి ప్లీజ్్ లేటుగా ప్రతిస్పందించినందుకు క్షమించండి.
ఈ టపా చూశారా!
http://turupumukka.blogspot.com/2009/09/blog-post_05.html