…పురజనుల కోరిక మేరకు.
పొద్దు గడికి స్లిప్పుల సర్వీసు బయలుదేరుటకు ప్లాట్ఫారమ్మీద సిద్ధంగా ఉంది. కూఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊ చుక్ చుక్!!!
అడ్డం 1: పొద్దుకొచ్చి పొద్దుపోయిందంటారేమిటి గొల్లపూడి గిరీశం గారు! (6)
గిరీశం డవిలాగే గొల్లపూడి మారుతీరావు నవల పేరు.
అడ్డం 15: అరగజం దూరంలో, అదిగో పెద్ద కొండచిలువ! (4)
అరగజం అంటే పొడుగెక్కువైపోలే? ‘తోక’ను మింగేసి తల కదల్చకుండా శరీరాన్ని తలకిందులుగా కొలిచిచూడండి.
అడ్డం 8: తిన్నది తాపీగా అరిగించుకోండి (3)
అది అందరికీ సాధ్యమా? ఏ అగస్త్యుడో రావాలి బాదామి కొండ దగ్గరికి. అప్పుడే అది “జీర్ణం జీర్ణం…” అయ్యేది.
నిలువు 3: కర్పూరవసంతరాయలి ప్రేయసిదే కులమయితే నేమి? (3)
గతంలో కూడా ఈమె పొద్దు గడిలో వయ్యారమొలికించింది. చూడబోతే ఈమె మీద గడి కూర్పరులు బాగానే మోజుపడ్డట్టున్నారు!
hmmm.. ఇంత లేటుగా వస్తే ఎలాగండీ.
21 అడ్డం – ఎండాకాలంలో కొందరు పుణ్యాత్ములు ఇవి ఏర్పాటు చేస్తారు. వాళ్లు చల్లగుండాలి.
17 అడ్డం.. లలితగారి బ్లాగు పేరేంటబ్బా?? అది వస్తే నిలువు కూడా వచ్చేస్తుంది.
4 నిలువు .. దిక్కూ …… లేకుండా తిరుగుతున్నావేంట్రా ??
11 అడ్డం.. ఈ బాధలు రెండు నెలల క్రింద రెండుసార్లు కలిగాయి కదా
హమ్మయ్య, వచ్చేశారా? ఇంకా మీరు కనబళ్ళేదని ఇప్పుడే నేను మొదలెట్టా ఒక స్లిప్పుల సర్వీసు.
15 & 28 అడ్డం – బ్రౌణ్యాన్ని ఆశ్రయించాల్సిందే!
“సుగాత్రి గారు ఎక్కడునా స్టేజీ మీదకి రావలెను” అని అనౌన్స్ చేసాక కూడా బండి లేటేనా?
సరే ఇక్కడ సిద్ధంగ ఉన్న స్లిప్పులన్నీ నా దగ్గారున్నాయి కాబట్టి కొన్ని స్లిప్పులు నేను ఇస్తా, తీస్కోండి కావలిస్తే!
20 అడ్డం…ఆసు, రాజు , రాణి….
15 అడ్డం..హిందీలో కొండచిలువ పేరుకి సున్నా కలిపితే చాలు.
30 అడ్డం: “పత్ర” మును తిరగేయడానికే అంత సిగ్గైతే ఎలాగండి?
46అడ్డం: పడగ పండక్కీ బూజులు ….ల్సిందేనా?
40 అడ్దం: మొత్తమూనూ..( ఈ క్లూ భలే ఉంది)
1 నిలువు…”రాజు లేనప్పుడు ……నువ్వు రారాదా పోరాదా..” పాట ఈయన హిస్టరీ లొదే!
9 నిలువుకి,28 అడ్డానికి స్లిప్పులు కావలెను.
ఈ ఏకాక్షరాల క్లూ కూడా నా మృణ్మయ మస్తకానికి తట్టడం లేదు
@ జ్యోతి,
అప్పుడప్పుడు అలా లేటౌతూ ఉంటుందండీ.
21, 17 అడ్డాలు బాగా చెప్పారు. 4 నిలువు: గడిని అడ్డుపెట్టుకుని ఎవరినండీ అలా తిడుతున్నారు?
@ కొత్తపాళీ గారూ,
చూశాను. మీ సర్వీసు బాగుంది.
15, 28 అడ్డాలా? చూసి చెప్తాను. కాస్తాగండి.
@ సుజాత,
అనౌన్స్ మెంటు నేను సెలవులో ఉన్నప్పుడొచ్చింది.
28 అడ్డం: కొత్తపాళీ గారు చెప్పినట్లు బ్రౌణ్యాన్ని తవ్వితే దొరికింది. జంతిక తల జంప్ ఐపోయి దాని స్థానంలో గంగాళంలో దూరిపోయే సన్నని గొంతు వచ్చి చేరింది.
వచ్చేశారా!! ఇంకా స్లిప్పులు ఎలా సంపాదించాలా అని తెగ హైరాణా పడ్డాను.
సుగాత్రిగారు,
ఆ మాట చదివిన మగవాళ్లు ఎవరైనా అరే! మా అమ్మానాన్న నన్ను ఇలాగే తిట్టేవారు , చదువుకోకుండా స్నెహితులతో తిరుగుతుంటే అని అంటారేమో అని మిగతా సగం వదిలేసా..
నాకు 9 నిలువు, ఏకాక్షర పదాలు తప్ప అన్నీ వచ్చాయి.. కొత్తపాళీగారు, మీరే దిక్కు .
ఇంకా ఎవరూ రాలేదేంటీ ఈసారి..
6 నిలువు: ఆదిశేషుడంతటివాడైనా ఆ అన్నకు తమ్ముడే! అదే అద్వైతంలో అతడి విశిష్టత!!
9 నిలువు, ఏకాక్షరాలు: వీటికి స్లిప్పులు కావలెను. ఇవ్వగల దాతలు బ్లాగులున్నంత కాలం యశోవంతులై శోభింతురు గాక!
ఏకాక్షర క్లూలు
48 కి నా బ్లాగులో ఊదం మంచి అల్లమంత ఘాటైన పోటు వేశారు.
ఈమాట నేను రానారె రాసిన మొట్టమొదటి ఛందోపద్యంలో విన్నాను.
ఎనీవే .. ఆ తీగ పట్టుకుని లాగితే కదిలిన డొంక ఇది.
45 .. ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఇది ఉండాలి కదండీ.
23 .. హబ్బ, ప్రయత్నం అంటే ఆయాస పడ్డం కాదు, అవస్థ కాదు, ఆస్త్మా అంతకంటే కాదు!
కొత్తపాళీ గారి క్లూలు బట్టి నాకు ఏకాక్షరాలొచ్చాయి. రాని వాళ్ళకి ఇంకా సింపుల్ క్లూలు
23.. ఆది అక్షరమే, ఒకె ఒకె ముందు వాక్యంలో కూడా అదే ఆది, ఆవులో కూడా ఉందే
45. స్థిరంగా ఇల్లుకట్టుకోవడానికి స్థైర్యం, అంతస్థు , ఆస్థి, తో పాటు ఇంకేమి కావాలి చెప్మా
48. లంబోధరునికిమొక్కి లంచమివ్వక లంఘించె లంకపైకి లంకిణినితన్ని .. ఆది ప్రాస బాగుందే
మరి తొమ్మిది నిలువు సంగతేంటీ?
@జ్యోతి,
9 నిలువు: ఇంద్రకీలాద్రి మీద వెలసిన అంబను సంస్కృతంలో అడగండి: ఇదెక్కడి “తుమ్మెద పురుగు” న్యాయమమ్మా? అని. ఇంకా వెలగకపోతే కొ.పా. బ్లాగులో ఊ.దం. గారు గొప్ప స్లిప్పు ఇచ్చారు చూడండి.
ఏకాక్షరాలతో ఇంకా చీకాకు పడుతున్నవారికి:
48: భారతదేశంలో మొట్టమొదటి టాకీ ఈ యుద్ధంతోనే మొదలైనట్టుందే!
సుగాత్రి గారు
వెలిగిందిలెండి.. మీరు లేటుగా వచ్చినా. గడి త్వరగానే పూర్తయింది. ఇక మేము సర్వీసునెక్కి పొద్దుకు వెళ్లిపోతున్నాము. వచ్చే నెలలో కలుద్దాం.
దీపావళి శుభాకాంక్షలు..
11 అడ్డానికి ఒందు స్లిప్పు బేకు..
౩ నిలుకు కలిసే 11 అడ్డానికి స్లిప్పు కావాలి.
వచ్చేసింది. క్లూ ఇక్కడ
శివుడద్రిని శయనించుట
రవి, చంద్రులు మింటనుంట, రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట, నల్లి బాధ పడలేక సుమీ
@ దైవానిక,
35,45 clues pllzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz…….
sorry 43 plzzzzzzzzzzzzzzzzzzzzzzzz….
swarupkrishna గారు,
35.. “విన్న” వించుకోనా.. ఒక “కోట” కథ..
43… ఉన్నవి రెండే పదాలు ఇందులో పక్క పక్కనే నిలబడ్డాయి. రేపు ” క లు ” స్తా..
అటుదిటు చేసి చూడండి.
thank u very much jyothi gaaru. 29 okkaTI migilindi. chacchinaa artham kaavaDam lEdu.
konchem sahaayam chEyanDi pllllllllllllzzzzzzzzzzzzzzzzzz……
swarupkrishna గారు
కోతి ని తలక్రిందులుగా వ్రేలాడదీసి మధ్యలో “రా”ముడిని తలుచుకోండి. ఎలాగూ అతని సైన్యంలోనిదే కదా అది.
స్వరూప్ కృష్ణ గారు, తిన్నగా ‘కోరొ’చ్చు కదా అంటున్నారండి.
naa gaDi ayipOyindochccccc………………thanku andariki…..
కొన్ని రోజులనుండి ఈ గడి వంక చూడకపోవటం వలన నేను వెనకబడిపోయాను. నాకు ఇంకా కొన్ని రావాలి
28 అడ్డం గరగడ అని వస్తోంది రైటేనాండి?

29 నిలువు క్రింద నుండి కోతో మొదలవుతుందని తెలుసు కానీ ఆ తర్వాత తెలియటం లేదు
11 అడ్డం కూడా రావ్టం లేదు 3 నిలువు లకుమా నేనాండి?
సింగిల్ గడులు కూడా రాలేదు
కొంచెం ఎవరైనా చెప్పండి ప్లీజ్
ఎందుకనో కొత్తపాళీ గారి బ్లాగ్ లో పోష్ట్ పని చేయటం లేదు !
@శ్రీలు:
28 అడ్డం: మీరు అనుకుంటున్నది కాదండీ, పైన 6వ వ్యాఖ్య చూడండి.
29 నిలువు: ఇన్నిరోజులూ మీరు గడిని ఏమారితిరా? పదం మొదలు తెలిసిందిగా? ఇక సమాధానం రాసెయ్యండి మరి.
11 అడ్డం: పైన 18వ వ్యాఖ్య చూసినా తట్టకపోతే చెప్పండి. (దాని పేరే సంస్కృతంలో)
3 నిలువు: ఆమే.
సింగిల్ గడులకు పైన 10, 11, 14వ వ్యాఖ్యలు కలిపి చూసుకుని ప్రయత్నించండి.
చాలా చాలా థ్యాంక్స్ అండి సుగాత్రి గారు 29 నిలువు ,11 అడ్డం వచ్చినాయి
48 మొట్ట మొదటి టాకీ వచ్చి వెదికితే “ఆలం అరా ” వచ్చింది ఇందులో యుద్ధంతో మొదలయ్యేదేముందో తెలియటం లేదు.

దైవానిక గారు ఇచ్చిన క్లూ ప్రకారం ఇల్లు కట్టుకోవటానికి చోటు ఉండాలా? లేక వాస్తు నా?. ఏమిటో ఈ మట్టి బుర్రకు అస్సలు తట్టటం లేదు
28 అడ్డం బ్రౌణ్యం లో వెతికి వెతికి వేసారిపోయాను ఇక మీరిచ్చిన క్లూ ప్రకారం “గళం ” తో మొదలవుతుందా? గళంతిక ? ఏమిటో వింత వింత పేర్లు కనుక్కుంటున్నా ఈ గడి కాదు గానీ
9 నిలువు మీరిచ్చిన క్లూ అర్ధం కాలేదు
48: “ఆలం అరా ” ఆ పేరే ‘యుద్ధం’తో మొదలైంది. చూడుడు బ్రౌణ్యము.
ఇంతకూ ఆ వింతపేరును బ్రౌణ్యంలో వెదికారా?
దైవానిక గారు చెప్పింది మొదటిదే. చోటునే ఇంకేమంటారో ఆలోచించండి.
28:
9: “ఈ రోజుల్లో న్యాయమేమిటీ, మీ భ్రమకాకపోతే,
ఏంటో ఆ మాటవింటేనే నాకు గొంగళిపురుగు పాకినట్టుంటుంది.”
-ఊదం
“ఇంకా వెలగని వారికి .. 9 నిలువులో న్యాయం నిజంగా న్యాయం కాదు. అదొక స్థాలీపులాక న్యాయం .. ఒక ఘుణాక్షర న్యాయం. చేదించి సాధించడానికి అవసరమైన ఇతర అవలంబనలు ఇప్పటికే ఊదం నొక్కి వక్కాణించారు.” -కొ.పా.
సుగాత్రి,
మీ స్లిప్పులు చూస్తుంటే మతి పోతోంది. ఈ సారి గడి ఎలాగైనా మీరే ఇచ్చెయ్యాలి. మేం పూర్తి చెయ్యాలి.(కావాలంటే నాకు ప్రైవేటుగా స్లిప్పులిద్దురు గాని)
శ్రీలు,
28 అడ్డం మీకు వచ్చిందే!
9 నిలువు….సుగాత్రి “భమ” అంటున్నారుగా! పైగా గొంగళి పురుగనే “కీటక” మును కూడా తలుచుకున్నారాయెను.
ఏకాక్షరాలు…ఆ -లం మధ్యలో ఇల్లు కట్టుకోడానికి కొంచెం “స్థ” లాన్ని సంపాదించండి.
చాలా థాంక్స్ అండి సుగాత్రి గారు

సుజాత గారు మీకు కూడా చాలా చాలా థాంక్స్ అండి విడమరచి వివరించినందుకు
నా గడి పూర్తి అయ్యింది అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో నాకే తెలీదు కానీ పూర్తి మటుకు చేసాను. అలాగే కొత్తపాళీ గారి బ్లాగులో నాకు క్లూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
సుగాత్రి గారు, క్రొత్త గడొచ్చేసింది.. స్లిప్పుల సర్వీసు మొదలెట్టాలి
దైవానిక గారూ,
మీరు చెప్పాకే చూశా. నెనర్లు. వస్తున్నా, వస్తున్నా.