ప్రొఫెసరు కొవ్వలి సత్యసాయి గారికి సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, లాంటి లలిత కళలన్నింటిలో ఆసక్తి ఉన్నా సంగీతం ముందు మరేదీ నిలవదనుకుంటా. ఆయన కూర్చిన గడి తెరిస్తే చాలు శ్రావ్యమైన శాస్త్రీయ సంగీతం “దర్శనమిస్తుంది”. ఈ నెల గడిలో సంగీత సంబంధ ఆధారాలతో మొదలుపెడదాం:
అడ్డం:
9. దశ ల స్థానాలు మార్చాం. అయినా ఇలాంటి నదిలో స్నానం బెటరా రాముని సన్నిధి బెటరా అని త్యాగయ్య గారికి డౌటే డౌటు.
నిలువు:
4. ఎనిమిది ఏనుగుల్లో ఒకాయనా? సంగీతరహస్యాలు తెలుసటగా!
45. షడ్జం.
వీటిలో నిలువులు సులభంగానే వచ్చేశాయి. (మనలో మాట: 4 నిలువులో ఆయనకు సంగీత రహస్యాలు తెలుసన్న విషయం నాకూ ఇప్పుడే తెలిసింది. ఎంతైనా మనకు మను చరిత్ర తెలిసినంతగా వసుచరిత్ర గురించి, అది రాసినాయన గురించి తెలియదు కదా?
)
5 నిలువు మీకు తెలియకపోతే భైరవద్వీపం సినిమాలో “శ్రీ తుంబుర నారద నాదామృతం” పాట ఒకసారి శ్రద్ధగా వినండి.
9 అడ్డం: ఆ నది ఏమిటో నాకూ తెలియదు. ఎవరైనా ఒక స్లిప్పు పంపండి, ప్లీజ్!
9. “నిధి చాల సుఖమా” అని గదా త్యాగరాజు అడిగింది?
45. “స”డ్జం కాదా
9. నిధి చాల సుఖమా పాట లో వెదకండి
నాకెవరైనా ఈ (29) ద, (34) ర గుణింతాల విషయంలో సాయం చేయకూడదూ? అవి ఉన్న గడులు తప్పితే అన్నీ ఐపోయాయి…
రాఘవగారు,
29, 34 అచ్చులు, హల్లుల తర్వాత ఏవి నేర్చుకుంటారో అవేనండీ – ఆ అక్షరాల…
అదా చిదంబర రహస్యం? నేనింకా ఏమిటో అనుకుని తెగ ఇదైపోయాను. ఐతే నా గడి ఐపోయిందోచ్.
38, 34 kindly send the clue please
34 ఆధారంలోనే 38కి సగం సమాధానం ఉంది. మిగతా సగమూ ఆధారంలోనే అందిచ్చేసారాయె!
34 లో పతనమైంది, పడిందన్నారు కదా. పడితే అన్నీ సరిగ్గా ఉంటాయా… అవయవాలన్నీ కదిలిపోవూ?
ఈసారి ఏంటి ఇంకా సీరియస్ గా మొదలయ్యినట్టులేదు? నావి చాలా వరకు అయినట్టే
రాఘవ గారూ,
అందరికంటే ముందు మొదలుపెట్టి అందరికంటే ముందు పూర్తిచేశారన్నమాట. అభినందనలు.
స్నేహ గారూ,
తెలిసిందండోయ్, నెనర్లు.
సూర్యప్రకాశ్ గారూ,
మీరిచ్చిన స్లిప్పు నాక్కూడా ఉపయోగపడింది. మీక్కూడా నెనర్లు.
దైవానిక గారూ,
మీ గడి కూడా ఐపోవచ్చిందన్నమాట.
స్వరూప్ కృష్ణ గారూ,
మీ గడి ఎంతవరకూ వచ్చిందండి, క్లూలు సరిగా అందాయా? నింపి పంపేశారా?
16 నిలువుకు ఎవరైనా ఒక స్లిప్పు పంపండి, ప్లీజ్!
సుగాత్రి,
రెండు వారాలకో సారి బ్లాగ్మహిళలు జరుపుకునే సమావేశంలో మొదట్లోనే మీకీ భ్రమ లాంటిది దొరకును.
42 అడ్డం మాత్రం మిగిలింది. ఏమి అర్థం కావడం లేదు.సుగాత్రి గారు హెల్ప్ చేయగలరా?
…కు వింటి చిరాయువును చురచురా చొరవతో చూడండి, దెబ్బకి బోల్తా పడకపోతే ఒట్టు
43 అడ్డం మాత్రం మిగిలింది. 42 కాదు.
సుజాత గారూ!
అడ్డాలను బట్టి అదే అనిపించిందిగానీ ఎప్పుడూ వినని పదం. అందుకే డౌటొచ్చేసింది. థ్యాంక్యూలు.
స్వరూప్ కృష్ణ గారూ!
43 అడ్డం: తిలక్ కథల గురించి ఈ మధ్యే ఊహలన్నీ ఊసులైపోగా విన్నాను. ఆ ఊసుల్లోనే చూశాను ఈ మెలికలు తిరిగిన ‘నజర్లల్ల రోడ్డు’ని.
28 అడ్డం మిగతావాటి బట్టి వచ్చింది కానీ అదేవిటో తెలీడం లేదు!
కామేశ్వర రావు గారు,
28 అడ్డం అడ్డదిడ్డంగా వేసుకున్న ‘పైట ‘ అనుకుంటున్నాను.”ఇది లాగాడు ‘ అని కూడా అన్నారు కదా! కానీ బాదించుకోవడం ఏమిటో తెలీలేదు.నాకూ మిగతావాటిని బట్టే వచ్చింది.
29,34 కి స్లిప్ లు ఇవ్వగలరా.
కామేశ్వరరావు గారూ, సుజాత గారూ,
10 నిలువాయన చేయి పట్టుకుంటే ఆడవాళ్ళెవరికైనా ఓకే. “ఇది” లాగాడు కాబట్టే “బాదించుకుని” ఇలా అయిపోయాడు…
నేను కూడ ఈ రెండిటిని బట్టే లాగబడి సరిగాలేకుండాపోయినదాన్ని సరిచేసుకుంటారేమో అనుకున్నాను!
సుజాత గారూ,
పైట లాగితే బాదించుకోక తప్పించుకుంటారేమిటీ?
స్నేహ గారూ,
మీరు అడిగిన స్లిప్పులు సర్కులేషన్లో ఉన్నాయి. పైన 3, 4 కామెంట్లు (రాఘవ గారి సందేహం, దానికి సూర్యప్రకాశ్ గారి సమాధానం) చూడండి.
ధన్యవాదాలండీ సుగాత్రి గారు. ఊసులవిషయం తెలిపినందుకు. నా గడి నిండిపోయిందోచ్.
సుజాతగారు,
ఓ అదా! ఇప్పుడర్థమయ్యింది. నేనెంతసేపూ పాదాల గురించే ఆలోచించేను కాని పైటగురించి ఆలోచించలేదు! రాముడు మంచిబాలుడు అన్నట్టుంటే ఇదే తంటా
ఓ మాదిరిగా అయిపోయినట్టే ఉంది గడి.
38 అడ్డం సగమే వచ్చింది. కొంచెం సహాయం ప్లీజ్! మధ్యలో రెండక్షరాలూ రావట్లేదు.
@ సుజాత:
మొదటి రెండక్షరాలను కలిపి సంస్కృతంలో “మిషను” ఆడించండి. దాంట్లోంచి “పాతి”కో, పరకో రాలుతుందనుకున్నారా? అబ్బే, పూర్తిగా కాదు.
15 అడ్డంలో ప్రమాణం తెలిసింది గెలుపు ఏమిటో
అవును, 15 అడ్డంలో మొదటి సగం నాకూ రాలేదు. ఎవరన్నా ఒక స్లిప్పు పడెయ్యొచ్చుగా!
15 అడ్డం – నాయకులందరూ ఏది గెలవడానికి “ప్రామిస్”లు చేస్తారు?