ఈ టపాకు టైటిలు భలే ఉంది కదా? అది ‘బ్లాగాడిస్తా’ రవి గారు సూచించారు. ఏప్రిల్, మేలలో ఎండలు మండుతాయి. బహుశా ఆ ఎండల వేడిమి గడి కూర్పరులకు బాగా తగిలినట్లుంది. గడి మే లో కొంచెం కష్టంగా, జూన్ లో మరీ కష్టంగా, రవి గారి మాటల్లో చెప్పాలంటే ఒకటి కదళీపాకంలో ఉంటే ఇంకొకటి నారికేళపాకంలో ఉంది.
ఈసారి ఋతుపవనాల చల్లదనంతో కాబోలు గడి కూడా (ఆ రెండు నెలలతో పోలిస్తే) సులభంగానే అనిపిస్తోంది. ఈసారి సాధకుల మొదటి ప్రశ్న 45 అడ్డానికి ఆధారంలో నాలుగక్షరాలుంటే గడిలో ఒక గడే ఉందేమని? అన్నట్టు భక్తులకు 1, 4, 44, అడ్డాలు వచ్చాయా? నాకైతే ఈ నాలుగు పూసల్లో ఒకే దారం కనిపిస్తోంది. మీరేమంటారు బ్లాగ్వీరులారా!
జూలై గడికి స్లిప్పుల సర్వీసు
జులై 9, 2008 సుగాత్రి చే
1,4,44 – హిందీలొ, తెలుగులో సినిమా పాట ఉన్నట్టుంది.కాని హిందీలోనే పలకాలి. కరక్టేనా??
6 నిలువు … ఎక్కడ కోతిమూకలాంటి పిల్లలను చూసినా ఇలాగే అంటాము. ఇది తెలిస్తే 12 అడ్డం ఈజీనే..
గడిని చూడగానే నాకు వచ్చినవి ఇవి. ఇంకా 39, 42 కూడా ఈజీనేకదా.
చూద్దాం..
అమ్మో, నేనింకా మొత్తం చూడనే లేదు! అవునూ, ఈ ఒక్క అక్షరం సమస్యలేవో దుంప తెంచేలా ఉన్నాయే!
29 నిలువు :ఈమె పేరులోనే పాండురంగని ఊరు కలదు.
27 అడ్డం: ఘంటసాలా ఇదే పాటా, బాలూ ఇదే పాటా?
15 అడ్డం: ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారినడగాల్సిందే! పునరపి గడులూ, పునరపి స్లిప్పులూ!
38 అడ్డం: పంచా, చాపా కాదండి, కొంచెం ఆలోచించండి!
మొదలెట్టేశారా? శుభం.
nEnu modalu peTTESaanu, O gaMTa kustI paDitE 25% vacchaayi!
I week end chooDaali
5 అడ్డం – 1, 3, 2 ని 1,2,3 చెయ్యండి (పదాలు కాదండోయ్)
13 నిలువు – రాముడి అన్నయ్యకి మర్యాద ఎక్కువే
14 అడ్డం – నమకం తరవాతదే
14 నిలువు – నాలుగు చేతులు
30 నిలువు – నాయకునికి ముందు చంద్ర, నటుడి తర్వాత మోహన్
41 నిలువు – కొంచెం కోవా లాగే ఉంటుంది
ఈసారి నిజంగానే కొంచెం సులభంగానే ఇచ్చారు మాష్టారు. మిగిలినవి తెలియక పోతే త్వరలో స్లిప్పులు.
జ్యోతి గారూ, సుజాత గారూ, ఈ ఒక్క అక్షరం గళ్ళు వరుసగా ఒకాయన బ్లాగు పేరు అని నా అనుమానం. ఆయన పేరు ౪౫ (45)అడ్డం మొదటి వాక్యం (!) ఆఖరు పదంతో మొదలవుతుంది. ఆయనను నా ద్వారా ప్రసరిస్తాడు
.
౨౮(28) నిలువు తో ఓ పద్యం పూరణ ఉంది. ……మశకపు గొంతుక జొచ్చినది.
౩౩ నిలువు కి స్లిప్పులు ఎవరైనా తెలుపగలరా? అలానే అడ్డం ౧౪(14).
సూర్య ప్రకాశ్ గారు ౧౪ (14 ) అడ్డం నా మృణ్మయ బుర్ర కి తట్టడం లేదు. ౮ (4) నిలువు తో ఎలా కలుస్తుంది?
౪ నిలువు…” ఖుషీ ఖుషీ గా నవ్వుతూ,హుశారుగా ఉన్దాములే …మజాగా” ఖాళీ పూరించండి. మమ్మల్ను హిన్దీలో + షా..
అవునూ, ఈ 1, 4, 44, 45 మొత్తం కలిపి ఆ..తెలుగు బ్లాగు పేరు రాయాలంటారా ఏమిటి?
37 అడ్డం: ప్రాగ్దిశ వీణియ పైనా దినకర —-తంత్రులపైనా!
ఇంకా ఏ స్లిప్పులు కావాలి? నాకు ఒకటో రెండో పడ్డాయి బ్రేకులు. స్లిప్పులడక్కుండా సాధించే ప్రయత్నంలో ఉన్నాను. చూద్దాం!
రవి,
33 నిలువు ఒకటే అక్షరం రెండు సార్లు వచ్చి ఆగింది. ఆలోచిస్తున్నాను.
14 అడ్డం మన ప్రమేయం లేకుండానే ఫిలప్ అయిపొయిందే!
సుజాత గారూ,
“అవునూ, ఈ 1, 4, 44, 45 మొత్తం కలిపి ఆ..తెలుగు బ్లాగు పేరు రాయాలంటారా ఏమిటి?”
అలానే అనిపిస్తుంది. అన్దుకనే 45 వగడి క్లూ అలా ఉంది.
33 మీరన్నట్టు 2 అక్షరాలు వచ్చాయి. 14 అడ్డమ్ వచ్చింది. అయితే ఆధారానికి మనకు వచ్చిన సమాధానానికీ పొంతన ఏమిటా అన్నది అర్థం కావడం లేదు.
33 నిలువు, 42 అడ్డం మాత్రమే మిగిలాయి. మిగిలినవి కావాలంటే చెప్పండి. స్లిప్పులు రెడీ
జ్యోతి గారూ!
ఈసారి మీరూ తయారన్నమాట. మరీ సంతోషం. స్లిప్పుల పర్వం మరింత సందడిగా ఉంటుంది.
సుజాత గారూ!
మొదట మీరలానే అంటారు. చివరికేమో వీరతాళ్ళు వేసేసుకుంటారు.
కొత్తపాళీ గారూ!
నెనర్లు, మీరీ మధ్య గడికేసి చూస్తున్నట్లు లేదు, ఇలాగైతే మాలాంటి భక్తుల పరిస్థితి ఏం కాను?
చావా కిరణ్ గారూ!
నాకు తెలుసు, ఆధారాల్లో “బ్లాగుంది” అనే పదం కనబడగానే ఈ గడి మీకు నచ్చేసి ఉంటుందని. శుభం!
సూర్యప్రకాషు గారూ!
మీ స్లిప్పులు సూపరు. 14 అడ్డం సగమే. గతనెల గడిలో కూడా ఈ మే గురించి కొంచెం కంఫ్యూజయ్యారు భక్తులు.
41 నిలువు: ఆమె గొంతు మరీ అంత తియ్యగా ఉంటుందా?
14 నిలువు ఇంకా రాకపోతే భక్తులు విఘ్నాలు తొలగిపోవడానికి వినాయక ప్రార్థన చెయ్యండి. “శుక్లాంబరధరం …”
రవి గారూ!
ముందు నాకు 32, 38 అడ్డాలు చెప్పండి.
14 అడ్డం: కన్యాశుల్కంలో వెంకటేశం ఆ మంత్రం పఠిస్తాడు. 42 అడ్డం ఆధారంలోనే సమాధానం ఉంది. కనబడకపోతే అట్నుంచి నరుక్కురండి.
సుజాత గారూ!
ఈ నవ్వుల చాచా ఎవరో అర్థం కావడం లేదే! పెద్దలు కూడా ఇష్టపడే నవ్వుల చాచా ఎవరబ్బా?
ఏంటో ఈ సారి హిందీ ఉర్దూ సంరంభం ఎక్కువైంది. నాగమురళిగారి బ్లాగులో నెమరు వేస్తున్న హిందీ పాఠాల పుణ్యమా, లేక కూర్పరిగారు టుమ్మచ్ గా భూలే బిసరే గీత్ వింటూ కూర్చారా?
నాదైపోయిందోచ్!
డబ్బా కొట్టుకోవడం కాదుగానీ .. సరిగ్గా అరగంటలో!!
మరి కామేశ్వర్రావుగారి చేతి చలవో, ఇవ్వాళ్టి నా టీలో ఏమన్నా కలిసిందో?
కామేశ్వర్రావుగారూ, చాలా బావుందండీ .. ప్రతీసారీ మరీ జుట్టు పీకేసుకోవడాలూ, తలలు బాదేసుకోవడాలూ మరీ మెలోడ్రామా ఎక్కువైపోవట్లా .. అందుకని ఈ సారి .. అలా షైరుకి వెళ్ళొచ్చినట్టు .. జోరుగా హుషారుగా బావుంది.
నవ్వులచాచా కోసం ఆంగ్లంలో మాట్లాడకుండా వెదకండి. ఛఛ అని విసుక్కుంటే పని కాదు, మరి!
@సుగాత్రి
32 అడ్డం – bag ఆ? మరిందులో బాణాల్లేవే? దీపావళి ఎలా?
38 అడ్డం – పంచల చాపు కాదండీ! కోపం తాపం వొద్దు.
@రవి – 14 అడ్డం అర్ధం కావాలంటే ఇటు కన్యాశుల్కమో అటు నమకంతో పాటు చదివే వేద పనసో క్షుణ్ణంగా తెలిసుండాలి
@ మమసుజాత – ఐతే మీరు అప్రమేయులన్న మాట (ప్రమేయం లేకుండానే పూరించేస్తున్నారుగా!)
అవునండోయ్ ఈ సారి సులువుగానే ఉన్నాయి. నావి దాదాపు అయినట్టే. ఇంకో అయిదారున్నాయి.
సుజాత గారు,
29 నిలువు మీరు చెప్పిన పదం వచ్చింది కాని మొదటి మూడు ఎంతకీ తట్టట్లేదు(అంటే అడ్డం వల్ల మొదటి అక్షరం వచ్చింది).. ఇంకేదయినా స్లిప్పిచ్చి రక్షించాల్సిందే
33 నిలువు తేల్లేదు.
40 అడ్డం డౌటు.
దైవానిక,
‘రా ‘ అంటూ అదే ‘గతి ‘ లో (speed) అంటూ వెదకండి మరి!
దైవానిక .. your problems with 29 down show that you’re too young
I don’t think this lady cartoonist continued beyond 80s.
సుజాత – 33 నిలువు మీకింకా రాలేదంటే (ఇంత నోరు నొక్కుకుని చెప్పినా) నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే ఇంకో స్లిప్పు. పూర్వం “మాటల్లేని సినిమా”లకి వెండి తెరని “పాప్లిన్” గుడ్డతో కట్టేవారుట!
@ కొ.పా. గారూ!
32 అడ్డం: స్లిప్పు సూపరు. 38 అడ్డం: కుడి ఎడమలు ఓకేగానీ ఈ సుందరాంగి నడుం నాకు కనబడ్దం లేదు.
లేదండీ, ఆమె ఇప్పుడూ కూడా వేస్తున్నారనుకుంటా. విశాఖపట్నం ఆమెది.
దైవానిక గారూ!
సుజాత గారి స్లిప్పు అందుకోండి మరి.
సుజాత గారూ!
33 నిలువు కొ.పా.గారు తేలేశారు చూడండి.
కొత్తపాళి గారు,
మట్టిబుర్రకు ఇంతకంటే మంచి ఉదాహరణ దొరుకుతుందా? ఇప్పుడే మా వారు ఒక్క సెకనులో చెప్పారు క్లూ చెప్పగానే! మళ్ళీ వచ్చి చూస్తే మీ క్లూ! అన్నట్టు ఆవిడ ఇప్పుడు కూడా వేస్తున్నారండీ కార్టూన్లు! మీరిక్కడ లేక, మీరు చూడటం లేదనుకుంటా! అదీ గాక మీరు సపరివార పత్రికలు చూస్తే తెలుస్తుంది మరి! థాంక్యూ (క్లూకి)
సుగాత్రి గారు,
38 అడ్డం ఎటునుంచి చూసినా ఒకేలా ఉందన్నారుగా! అయినా రాలేదా? “ప” దంటే పది లెక్కెట్టేలోపు చెప్పెయ్యాలి మరి! ఒ, రె, మూ, నా ! ……వచ్చిందిగా!
33 నిలువ్ అక్షరాల్ సంఖ్య్తో తికమక్ అవుతున్నామ్.
@సిసిము – పొల్లు అక్షరాన్న్ని విడిగా కొలవరు.
ఉదాహరణకి కారీత్క్ లో రెండు అక్షరాలే.
40 addam clue pls.
alaage 14 niluvu kudaa.
migataavanni paivi chudakane vachechesaayi.
సిసిము గారు .. నా హడావుడి టైపింగు మండిపోను.
అక్కడ ఉదాహరణ .. కార్తీక్.
అఫ్కోర్సు, కేవలం చెప్పదల్చుకున్న సూత్రానికి ఉదాహరణగా ఆ అచ్చుతప్పుకూడా పనికొస్తుంది
krishna – 14 నిలువు ఆల్రెడీ పైన అరటిపండు వొలిచి పెట్టారు.
40 అడ్డం (నర్తనశాల సినిమా చూశారా?) కేవల మర్త్యుడా? యముడి కొడుకుని పిలిచే పిలుపా అది?
సుజాత గారు & కొ.పా. గారు,
ఇందరు ఇన్ని రకాలుగా చెప్తున్నా నాకు బోధపడడం లేదండీ. ఇటు పంచ, అటు చాపా కనబడుతున్నాయి గానీ … మధ్యాక్షరం గురించే నా చింతంతా.
కృష్ణ గారూ!
మహాభారతంలో ప్రతివింద్యుడు సమవర్తి మనవడట. మరి అతడెవరి కొడుకో తెలిసిందా?
40 అడ్డం లో శత్రువులు లేనివాడేనా ఉంది ? ఏదో కొత్త పదం వచ్చింది నాకు
33 అడ్డం, 38 నిలువులు క్లూలు చదివాక కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయేంటో
@ దైవానిక,
40 అడ్డం: అవును.
మీరు 33, 38 అడ్డం, నిలువు ఆధారాలకు స్లిప్పులడగడంలో చూపిన తడబాటును అజాతశతృవు పేరును రాయడంలో చూపించండి.
ఆయన తడబడ్డాడు కదా? కొత్త మనిషిలాగే కనబడుతాడు మరి.
33 నిలువు: కొ.పా. గారు మాటల్లేని సినిమాకు “పాప్లిన్” తెరవెనుక స్విచ్చేస్తే మాకు “సిటీ”లో “లైట్స్” వెలిగాయి. మీకింకా వెలగలేదా?
సుగాత్రి, సూపర్.. 33 వచ్చేసింది
చా .. ఇంతోటిది కూడా తట్టలేదు నాకు
సుగాత్రి గారు,
“ప” దంటే పది అన్నా తట్టలేదా! సరే “లకోలకోల” అన్న మాట విన్నారా పోనీ? దానికీ ఇలాంటి అర్థమే ఉంది. “లకోలకోల ” లో మొదటి, మధ్య, చివరి అక్షరాలు ఒకటే చూడండి! 38 అడ్డానికి కూడా ఇదే విధంగా….వద్దులెండి, స్లిప్పు మరీ ఈజీ అవుతున్నట్టుంది.
దైవానిక,
ఇందులోని మ ‘ర్మ ‘ మేమో అశ్వత్థామనడగాల్సిందే! మిగిలిన రెండక్షరాలూ వచ్చేశాయా?
నేను పంపేసాను కూడా!
ఈ సారి తొందరగానే అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో గడి ఇస్తే బాగుండు మాస్టార్లు!
@ సుజాత,
పరీక్షలో గబగబా ఆన్సర్లు రాసేసి అడిషనల్ షీట్లు అడిగేవాళ్లను చూశాం. కానీ ఇంకో క్వెశ్చన్ పేపరిమ్మని అడిగేవాళ్లను మిమ్మల్నొక్కర్నే చూస్తున్నా.
సుజాత గారు, ఈ సారి కూడా వీరతాడు మీకేనేమో ??
సుగాత్రి గారు, ఇంత మంచి స్లిప్పులిచ్చి మీ పేరు ఎప్పుడూ కనపడలేదే?
నాకు 43 అడ్డం వస్తే అయినట్టే, నేను పంపేస్తాను .. 38 అడ్డంలో ఉన్న పదం ఎప్పుడూ వినలెదే ??
సుజాత గారు,
(పొద్దుకు పంపాను, తిరస్కారమే అనుకుంటా .. కాని ఇప్పుడు నాకే బాగా సులువుగా ఉందనిపిస్తుంది.)
నేనొక పదబందం తయారు చేసాను. నా బ్లాగులో పెడదామనుకుంటున్నా.. మీకు కావాలంటే నాకు మెయిల్ చెయ్యాలి
@ దైవానిక,
38 అడ్డం: నేనూ అదే ఆలోచిస్తున్నా. అందుకే ఆ పదం కోసం బ్రౌణ్యంలో దుర్భిణీ వేస్తున్నా.
43 అడ్డం: కందర్పుని మరోపేరు ఆధారంలోనే ఉంది. దాంతో మొదటి మూడక్షరాలు వచ్చేస్తాయి చూడండి.
సుగాత్రి ,
43 అడ్డం, నేను నిలువు ప(త)ప్పులో కలేసాను అందుకే కలవలేదు.. ఇప్పుడు సరిపోయింది.
38 అడ్డం బ్రౌణ్యంలొ కనపడలేదు నాకు.
నాది 39 నిలువు, 42 అడ్డం తప్పేమో అన్న చిన్న అనుమానం. 42 అడ్డంలో ఒక కులం పేరుంది కదా? నిలువులో చెట్టులో భాగం ఉంది…
ఇంతగా చెబుతున్నా 33 నిలువు నాకర్థం కాలేదు. 1, 3 అక్షరాలు తెలిసాయి. అవి రెండూ ఒకటే. ఆ చాచా ఇంగ్లీషు చంటబ్బాయా అని డవుటు.
14 అడ్డం మొదటే తెలిసింది. ఇప్పుడు కంఫర్మ్ అయ్యింది. 42 కూడా అయిపోయింది.
సుగాత్రి గారూ, 38 గడి మధ్య ప దం అంత కష్టంగా ఉందా?
28 అడ్డం జర్రి అంత కఠినం కాదండీ!
33 ఒకటే బాకీ!
ఎవరైనా 43 అడ్డం స్లిప్ ఇచ్చి పుణ్యం కట్టుకొండి.అదొక్కటె మిగిలింది మిగతావి అన్ని అయిపొయినాయి
Thnak you kottapaali gaaru.
స్నేహ,,
43 ఆడ్డం చివరి రెండు పదాలు వచ్చి ఉంటాయి. ఇక మొదటి మూడు పదాలు.. హైదరాబాదులో హోలికాపున్నమిని ఈ పున్నమి అని కూడా అంటుంటారు. పైగా ఆ దేవుడిని కాలుస్తారు కూడా.
నాకు 13 నిలువు కాస్త సులువుగా అర్ధమయ్యే స్లిప్ ఇద్దురూ.. ఇంకా రాలేదు..
అదేంటొ గాని, ఈసారి గడి చాలా సులువుగా ఇచ్చారు. క్రితం రానారె ఇచ్చిన గడి తెలుగు phd కి పరీక్ష పేపర్ రాస్తున్నామన్నట్టుగా ఇచ్చాడు. అందరు పండితులు కారుగా, ఇలా కాస్తు సులువుగా ఉంటేనే నా బుర్ర ఆలోచించడానికి ఒప్పుకోదు మరి.
సుగాత్రి,
38 నిలువు మధ్యాక్షరాన్ని “ప”ట్టించుకోకుండా మిగిలినవి కానీండి!అన్నట్టు ఇక్కడ అడిషనల్ షీట్లు ఏం చేసుకోను? అందుకే మరో పేపరడిగాను!
రవి గారు,
33 నిలువు ‘అట్లాంటి ఇట్లాంటి హీరో కాదు వీడు” ఇంగ్లీష్ చంటబ్బాయే!
జ్యోతి గారు,
13 నిలువు…మర్యాదగా ఆ రామన్న ని పూజించి చూడండి! ఫలితముంటుందేమో!
దైవానిక,
మీ గడి మీ బ్లాగులో పెట్టండి. బహుమతులున్నాయా మరి?
థాంక్స్ అండి జ్యొతి గారు.
నాకు చివరగా ఒక బుల్లి స్లిప్పు ఇచ్చేయండి. 3 నిలువు..
జ్యోతి గారు, గొవిందయ్య గూగుల్ గుంపు లొ .వున్నాడేమొ వెదకండి 3 నిలువు అదె వచ్చెస్తుంది
చా.. ఇంత ఈజీ పదం రాలేదేంటీ?రానారె గడి ప్రభావం ఇంకా తగ్గలేదేమో. అంతుకే ఇంత సులువుగా ఉంటుందని తట్టలేదు. థాంక్స్ స్నేహగారు.
నా గడి కూడా ఐపోయింది. పంపేసాను. సుగాత్రిగారు మీరేంటీ అస్సలు పంపరు.. ఈసారి పంపకుంటే మేమందరం స్ట్రైక్ చేస్తాము. మీ బ్లాగులో స్లిప్పులు ఇవ్వము. తీసుకోము. అస్సలు రాము కూడా.
ఇక మీ బ్లాగు పేరు మొత్తం మార్చి పొద్దు గడి స్లిప్పుల సర్వీసు అని పెట్టుకోక తప్పదేమో. మీ మిగతా రచనలకు కొత్త బ్లాగు మొదలెట్టండి. లేదా స్లిప్పుల సర్వీసుకు కొత్త బ్లాగు ..
నాకు కూడా ఇంకో కొత్త ప్రశ్నాపత్రం కావాలి. ఇది పూర్తయ్యింది కదా . బోర్ కొడుతుంది మరి.
ఈ సుగాత్రి మా రామనాధుడేనేమో అని నా ‘అణు’మానం.
గాత్రంలో ఎక్కడనో కడప ప్రాంతపు శైలి తగులుతున్నట్టుగా లేదూ?
దైవానిక గారు,
మీ పూరణలో 39 నిలువు, 42 అడ్డం కరెక్టే కదా?
జ్యోతి గారు,
ఈ బ్లాగు గురించి మీ అవిడియా చాలా బాగుంది. అదేంటో నండీ ప్రతిసారీ నింపి పంపుదామనుకుంటూనే ఉంటాను, తీరా పంపబోతే రెండో మూడో మిగిలిపోతాయి.
సుజాత గారు & కడప గారు,
అసలు కలం పేరు పెట్టుకునేది అజ్ఞాతంగా ఉండడానికే కదండి? కొందరు ఫ్యాషన్ గా కూడా పెట్టుకుంటారనుకోండి, ఇక నా అసలు పేరు నేనుగా చెప్పను, మీరు ఊహించి ఏ పేరు చెప్పినా ఔననను, కాదనను. ఇక మీ ఇష్టం.
సుగాత్రి,
ఏమో తెలీదండి. పంపించేసాను అలానే
కడప గారు,
మీరే రానారె అని నేననుకుంటున్నానే!
సుజాతగారూ, చాలా సంతోషం. మేం చదువుకునే రోజుల్లో అయితే ‘మీరిద్దరూ అన్నదమ్ములా’ అని అడిగినవారు కూడా వున్నారు.
సుగాత్రి గారు,
ఇంకా గడికి టైమ్ ఉందిగా. మీకురానివేవో చెప్పండి. అవి తెలిసినవాళ్ళు చెప్తారు కదా. సాకులొద్దు.. ఈసారి గడి పంపినవారిలో మీ పేరు లేకుంటే మేము ఇక్కడికి రాము. అంతే రాం రాం.
హన్నా..
ఇక మీరు సుగాత్రి ఐనా షారూఖ్ ఐనా నో ప్రాబ్లం. మీరేంటి గడి కాకుండా వేరే రచనలు చేయడంలేదు. మొదలెట్టండి..గడి కోసం వేరే బ్లాగు మొదలెడదాం. తొలికోడిలా..
ప్రమదావనానికి వస్తా అన్నారు . ఈ ఆదివారం వస్తున్నారుగా???
కడప గారు,
జ్యోతి గారు,
సాకులు కాదండీ, నిజంగానే. మీరు మరీ అంత కఠ్ఠిన నిర్ణయాలు తీసుకోకండి ప్లీజ్!
38 అడ్డం: చాపమంటే ధనుస్సే కానీ సుజాతగారు చెప్తున్నది శివధనుస్సెలా ఔతుందో నాకు అంతుబట్టడం లేదు. బ్రౌణ్యంలో కూడా అలాంటి పదమేదీ లేదు.
ఈసారి నేను కూడా గడి నింపి పంపానోచ్! గడి గడువు ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి ఫలితాలు మరియు కొత్త గడి రేపు వస్తాయనుకుంటా. Waiting with my fingers crossed!