మే గడి సులభంగా ఉందని ఒకరికిద్దరు అనడం వల్లనో ఏమో సార్లు ఈ గడిని ‘బిగిం’చినట్లున్నారు. ఈసారి గడి వాలకం చూస్తే నాకు ఫలానా ఫలానా ఆధారాలకు స్లిప్పులు కావాలని అడగడం కంటే నాకు ఫలానా ఆధారాలకు మాత్రమే సమాధానాలు తెలుసు అని చెప్తే మిగిలిన అన్ని ఆధారాలకు స్లిప్పులు కావాలని భక్తులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. అన్నట్లు గడి లింకిదిగో: http://poddu.net/gadi/crossword.php
తక్షణం నేనివ్వగల స్లిప్పులు:
13 అడ్డం: వినగానే అచ్చతెలుగులో ఆభరణం అనిపిస్తుంది.
15 అడ్డం: పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికలు తిరిగే నాలుక. (చిన్నప్పుడు విన్న పొడుపు కథ)
43 అడ్డం: ఆ కోపధారి ఒక్కటిచ్చుకుంటే ఇచ్చుకున్నాడుగానీ ఆనందంతో “జలకాలాటలలో, కలకలపాటలలో ఏమి హాయిలే హలా” అని పాడాలనిపిస్తోంది. ఎంతైనా ఆయనా జగదేకవీరుడే కదా?
45 అడ్డం: ఈ సింహాలు, నక్కలు ఏమిటండీ బాబు, తొందరగా “వురుకో” వురుకు పొట్టపట్టుకుని.
47 అడ్డం: “గంజాయి దమ్ము బిగించి కొడితే … ఆపై <> కిళ్ళీ నమిలితే … ” ఏం గొడ్తె వస్తది భయ్ ఆ కిక్కు?
17 నిలువు: చెప్పేద్దును గానీ, చెప్పావులేవోయ్ అనిపోతారు మీరే. (డవిలాగు రైటు: విహారి గారు)
21 నిలువు:anagram
26 నిలువు: కడుపులో కూడా చిన్నా, పెద్దా తేడాలుంటాయి మరి
నిజమే, రానారె తన పాండిత్యమంతా రంగరించి గడిని కూర్చాడు సాధ్యమైనంత తిప్పలుపెడదామని. అయినా పర్లేదులెండి. మనం తక్కువ తిన్నామా?
33 అడ్డం : యుద్ధానికి ముందు “కి” ఇమ్మన్నాడు. యుద్ధమంటే యుద్ధమేనా, మారుపేర్లు లేవూ?
4 నిలువు : రామదాసు బాధని గుర్తు తెచ్చుకోవటమే
11 నిలువు : ఉర్దూ/హిందీలో ముగిసిందంటున్నాడు.
27 నిలువు : మొదలు చివర కాస్త సంస్కృతీకరించాక్కూడా దంతాలు ఎందుకు రావో చెప్పండి.
32 నిలువు : ఆదాయం మారుపేరు
ఇప్పటికివి కానివ్వండి. మిగతావి మెల్లిగా….
వికటకవి గారూ!
“మనం తక్కువ తిన్నామా?” బ్రేవో!

అందుకే ఇంకా అర్థం కాలేదు. అదేదో ‘ఖూనీ’ లా ధ్వనించే ‘పని’ అని నా అనుమానం.
మీకు బోలెడు తాంకులు.
33 అడ్డం: వచ్చేసింది! స్లిప్పు సూపరు!!
4 నిలువు: తెలిసిందనే అనుకుంటున్నాను. అడ్డాలు కలవకపోతే మళ్ళీ కలుద్దాం.
11 నిలువు: మనం హిందీలో చాలా కొంచెం వీకండీ!
27 నిలువు : ఔను సుమీ! ఎందుకు రావు?
32 నిలువు : ఓ! అనాగ్రమన్నమాట.
బ్రేవో మని సంతృప్తిగా తేన్చే దాకా తిన్నారు, మీరు తక్కువ తిన్నారని అనగలమా పెద్దలారా?
చదువరి గారూ!
పొద్దులో మీరు పెద్ద అని మాకు తెలుసు.
ఎలాగూ ఇటుకేసి రానేవచ్చారు. మీరు కాస్త పెద్దమనసు చేసుకుని వ్యాఖ్య రాసిన చేత్తోనే నాలుగు గహనమైన ఆధారాలకు స్లిప్పులు ఇచ్చివెళ్దురూ?
రానారె,
36 అడ్డం, నిలువు రెండూ సూపరు. అలాగే 46 అడ్డం కూడా ఇంకా సూపరు.
ఇకపోతే, 37 అడ్డం మూడు చెరువుల నీళ్ళు తాగించిందనుకో, చివరికి వచ్చిందనుకో ఆ ఇలామంతునాయుడెవరో తెలియకుండానే
నిజమే… రామనాథుడు క్లిష్టంగానే ఇచ్చాడు.
ఈ సారినుంచీ నేను కూడా స్లిప్పులందుకోవాలి… స్లిప్పులందించాలి
2,19 నిలువు
1,45,18,23 అడ్డం
ఇవి తక్క మిగిలినవన్నీ వచ్చినట్లే.
@వికటకవి: 18 అడ్డం నాకు తెలిసిపోయిందోచ్! ఆంగ్లమందు ఆవు+పంచితం. అంతే!
@రాఘవ: మహదానందం.
18 అడ్డం — అది తెలుసు, కానీ అది సన్యాసి ఆచ్ఛాదనం ఎలా అవుతుంది? అవుతుందా? ఏమో నాకింకా అయినట్లనిపించలా?
రానారె గారు ఇంత ఖఠినంగా ఇచ్చారేంటండి గడీ? ఒకసారి చూడగానే నాకు ఏమీ తట్టలేదు. పారిపోదామనుకుని,మీ అందరి స్లిప్పులు చూసాక కొంచెం ధైర్యంగా ముందుకొచ్చాను. జాగ్రత్తగా చూస్తే కొన్ని తెలిసాయి. నాకు బోలెడు స్లిప్పులు కావాల్సి వచ్చేట్టుంది మరి! సుగాత్రి గారు, రెడీ చేస్తే సరి!
ఈ సారి అప్పుడే మొదలెట్టేసారన్నమాట. నేనింకా గడి వంక చూడలా .. వారాంతంలో చూస్తాను… చూసి మళ్ళా కలుస్తాను
ఈ గడి చూసాక రానారెగారికి నేనివ్వదలచుకున్న టైటిల్ “వీడు సామాన్యుడు కాడు”:-)
జుత్తు పీక్కోగా పీక్కోగా, మొత్తానికి, తెలంగాణా మొరటోడు తప్పిస్తే అన్నీ వచ్చేసాయనే అనుకుంటున్నాను.
సన్యాసి ఆచ్ఛాదనలో భాగం, ఆంగ్ల పంచితం. దీనికి చివరన ఒక అక్షరం తగిలిస్తే సన్యాసి ఆచ్ఛాదన వస్తుందంటే నంమండి.
వికటకవిగారన్నట్టు 36 నిలువు, 46 అడ్డం సూపరో సూపరు!
ఇంకా ఇప్పుడే అందరూ మొదలుపెట్టారు కాబట్టి, నాకు రాలినంత జుత్తూ అందరికీ రాలిందన్న నమ్మకం కుదిరాక స్లిప్పుల కార్యక్రమం మొదలుపెట్టవచ్చు, అవసరమైతే:-)
కామేశ్వరరావుగారూ, మీబోటివారికైతే పెళ్లైపోయింది కాబట్టి జుట్టు రాలినా పెద్ద తేడా ఉండదు. మరి నాలాంటి శతమర్కటాల సంగతి ఏంటట? కనికరించాలి
వికటకవి శ్రీనివాస్ గారన్నట్టు నాకు కూడా ముందు వెలగలేదు… ఆవు పంచితం — ఇది సంన్యాసుల ఆచ్చాదన ఎందుకౌతుందా అని… తర్వాత సరిపెట్టుకున్నాను. ఆదిశంకరులంతటివారే దీనిమీద పంచకం చెప్పారు కదా అని!
36 నిలువు ఏదో గూబ గుఁయ్ మని తట్టింది కానీ 46 అడ్డం నాకింకా తట్టలేదు… అవలంబ మందించేవారెవరైనా ఉన్నారా???
@ వికటకవి: సన్యాసి ఆచ్ఛాదనం 3 అక్షరాలు. దాంట్లోని మొదటి రెండక్షరాలే మనకు కావలసింది. ఆంగ్లంలో ఆవు ఒకక్షరం, పంచితం ఒకక్షరం. మనకవసరం లేని మూడో అక్షరం కామేశ్వరరావుగారిచ్చిన స్లిప్పులో దాగుంది చూడండి.
@ సుజాత: అంత ఖఠినంగా ఉందనే కదా భక్తులు మీకోసం వెయిటింగిక్కడ?
@ దైవానిక: వారాంతం కలుద్దాం.
@ కామేశ్వరరావు: మీరు యాడికి అంటూ రాయలసీమకు వెళ్ళారు కదా? ఇక మొరటోడి కోసం రైట్ టర్న్ ఇచ్చుకోవాలన్నమాట.
@ రాఘవ:
46 అడ్డం: నాకూ అదే అర్థం కావడం లేదు. బెంగుళూరు మన(వాళ్ళ)ది కాదే? 38 నిలువు వస్తేగానీ ఇదొచ్చేట్టు లేదు. వికటకవిగారూ! ఒక స్లిప్పు బేకు, ప్లీజ్!
మీరంతా స్లిప్పులు చూసి ఇక ఆగలేక మొదలెట్టేసాను.
కదా.. కాస్త వత్తులు మింగేస్తె సరిపోదా??
46 అడ్డం మరి బెంగుళూరు ఎవరిదంటే, నమ్మ బెంగుళూరే
దైవానిక, పట్టేశారు. సుగాత్రి గారు తెలిసిందనుకుంటా.
అలా కాకపోతే ఇలా చూడండి.
38 నిలువు – బ్రౌణ్యం తీసి కూర్చితే సరి. “కూర్పు” కి బ్రౌణ్యమెందుకంటారా? అయితే కానివ్వండి
@దైవానిక:
46 అడ్డం: బెంగుళూరు ఎవరిదో చెప్పి నన్ను గట్టెక్కించారు. దానికే ఇంకో స్లిప్పు. ఒత్తులు రాని పిల్లాడ్ని ‘నమ్మ’ అనిరాయమంటే ఎలా రాస్తాడు? (చూ: కొ.కు. నవల చదువు)
@ వికటకవి:
38 నిలువు: మందమతిని, ముందు, వెనక ‘చూడం’ అని ఆధారంలోనే ఉంది కదా? అది నాకు ముందే ఎందుకు ‘కన’బడలేదో? మధ్యాక్షరం ముందే తెలుసు.
ఎందుకు రావని మీలో మీరే కొక్కొరొక్కో అంటే సరిపోదు (కోడి భాష)… 27 నిలువుకి కాస్త అయోడైజ్డ్ సాల్ట్ అందించండీ…
@ రాఘవ,
మరో క్లూ – 37 అడ్డంలో చివరి రెండక్షరాలు రైతన్న వృత్తి.
అడ్డం అంటే గుర్తొచ్చింది, కామేశ్వర రావు గారు, 44 అడ్డం మరీ పరుషం అన్నారు, పరుషం మాట దేవుడెరుగు, నాకు అది తిట్టుకి పై మెట్టల్లే ఉంది. ఫలాని అని ఇక్కడ చెప్పుకోలేని స్థితి.
మీరేమంటారు?
గడి కూర్చడం కంటే ఈ స్లిప్పులు చదివి అర్థం చేసుకునే కార్యక్రమం నాకు బాగా నచ్చింది.
@దైవానిక..మీ బెంగుళూరు స్లిప్పు అదుర్స్!
సుగాత్రి..చదువు కథానాయకుడు ‘అం మ ‘ అని రాసినట్టా? భలే!
18 అడ్డానికి మరో స్లిప్పు! –సం రక్షణార్థం..పిల్లిని పెంచి, చివరకు సంసారంలో పడ్డ సన్యాసి కధ గుర్తుందా?
నాకసలు ఒకటి అడ్డంలోనే పడింది బ్రేకు! పోయిన నెల అన్నీ వచ్చి కూడా హైదరాబాద్ వచ్చేసే హడావుడిలో పంపలేక్పోయాను. ఈసారి ఒక్కటీ రాక పంపలేనన్నమాట!
రానారె! ఎందుకండీ అంత లావు నవ్వూ? మా పాట్లు చూసే?
వికటకవిగారూ, మీది మరీ హై రేంజండీ బాబూ:-)
అవునూ, 11నిలువు హింది/ఉర్దుతో ముగిసిపోతే, 10అడ్డం కుదరదు కదా?
19నిలువు కూడా నాకు చాలా నచ్చింది. “క్షీరజధవుడు” బలే తప్పుదోవపట్టించింది నన్ను!
రాఘవగారూ,
ఇంతకీ నాకు పెళ్ళయిందన్న విషయం మీరెలా కనిపెట్టేసారో చెప్పండి?
1 అడ్డానికి బ్రౌణ్యమే గతి, ఎందుకంటే “తిరస్కారం” లోనే ఉంది చమత్కారం కాబట్టి. అది తెలిస్తే ధన్యులైనట్లే 1 నిలువు పూరించటానికి. హన్నా, ఎంత పని చేసావు రామనాథా.
11 నిలువు పొరబాటు నాదే. ఖూనీ లాంటిదే ఆధారంలోనే ఉంది. అదే కరకట్టు. అప్పటికి కార్మికుడు దొరికినట్టే, కానీ శృతి కట్టిన ధన్యాత్ముడు అందులోనే ఉన్నాడంటారా?
19 నిలువుతో కుస్తీ పడుతున్నా
** ఈ సందర్భముగా తెలియచేయునదేమంటే జూన్ గడి తాలూకు మన అన్ని రకాల ఊహలకీ గడికర్త రానారె పూర్తిగా బాధ్యుడు. ఏ రేంజ్ ఊహైనా సరే
19 నిలువు – నిలబడి నీళ్ళు తాగే రామనాథం కంటే, పరుగెత్తి పాలు తాగే సోమనాథం నచ్చాడండీ నాకు.
45,23 అడ్డాలు ?????? 45 అడ్డం మూడో అక్షరం “సిం” రైటేనా?
ఈ మంచు మౌంటెనుబాబు ఎవడండి బాబూ చలి పుట్టిస్తున్నాడు? (హిమ) గిరిబాబా,పర్వతబాబా,శేఖరబాబా లేదా కొండబాబా? లేక వీళ్ళందరి బాబు ఇంకెవడన్నానా? ఆ బాబు వీళ్ళకి బాబా లేక వీళ్ళే ఆయన బాబులా.
చెప్పండి బాబూ
@ వికటకవి:
23 అడ్డం: ఈ మంచునెలా విడగొట్టాలా అని తలపట్టుక్కూచున్న నాకు దోవచూపించారు. మీకు హ్యాట్సాఫ్! వాడు (హిమ)గిరిబాబే. ఆ గిరిబాబు సతీమణి పేరు గతనెలతో మొదయ్యే మూడక్షరాల ఒక అప్సరస పేరు. ఒట్టు! కావాలంటే విశ్వామిత్రుణ్ణడగండి.
45 అడ్డం: భీముడి పేర్లలో అదొకటి. ఎంత తిన్నా పొట్ట వీపుకు అంటుకునే ఉంటుందట తోడేలుకున్నట్లు.
19 నిలువు: హన్న రామనాథా! అందర్నీ ఎంత ఉరికించారు?
1 అడ్డం: వికటకవీ! మీరు దోవలు భలే కనిపెట్తారు. మీరు చెప్పాకే బ్రౌణ్యంలో ఎక్కడ చూడాలో తెలిసింది. నెనర్లు.
@ సుజాత:

ఈ గడి పూరించి మనమూ నవ్వుదాం.
“అడగక ఇచ్చిన స్లిప్పే ముద్దు” అనుకునేవారికోసం:
2 నిలువు: క్యారెక్టర్ ఆర్టిస్టుగా “పెద్ద” పేరున్న నటుడు. చెయ్యి, కాలు ఇంటిపేరులోను, నారా, పీచూ వంటిపేరులోను ఉన్నవాడు.
@ సుగాత్రి,
23 అడ్డం: పదం తిరగబడలేదని పొద్దు పెద్దలు సెలవిచ్చారండీ ఇక్కడ. http://poddu.net/?p=612. అపుడు ఇక మరి 17 నిలువుతో పొత్తెక్కడిది?
సుగాత్రి గారు, నా మతి పోయింది. “మే” లేకపోవటమేగా మనకి కావలిసింది
తాంకులు.
అవును 23 అడ్డం కరెక్టుగానే ఉందనిపిస్తుంది నాకు. గత నెల లేదంటున్నారు కదా!!!
@ సుగాత్రి,
23 అడ్డం – సమాధానం పక్కనబెడితే, అసలు (హిమ) గిరిబాబు విశ్వామిత్రుడు ఎలా అయ్యాడు? నాకు లైటు వెలగలా.
45 అడ్డం – తెలిసింది కానీ, ఇదేం విడ్డూరమయ్యా రానారె, నక్కని చూపించి తోడేలనుకోమంటావ్, ఎంత ఒకే జాతి జంతువులయితే మాత్రం. నక్క నక్కే, తోడేలు తోడేలే
40 అడ్డం – ఈ తెలంగాణా మొరటోడి సంగతి తేలిందా? నాకు సగం వచ్చాడు కానీ, తెలంగాణా మొరటోడు కాదు కదా తెలంగాణా ముసలోడిలా కూడా కనపడట్లా, 45 అడ్డంతో కూర్చినా. క్లూ ఇవ్వండి కాస్త.
@ సుగాత్రి,
అబ్బో, మంచు మౌంటెనుబాబు కథ ఇప్పటికి తేలింది. మోనియర్ విలియంస్ సంస్కృతాంగ్ల నిఘంటువు వివరాలు చెప్పింది. హిమగిరితనయ అనే విన్నా (పార్వతి తండ్రిగా), మొదట్లో తల్లిని గూగులమ్మలో వెతికా గానీ దొరకలా. ఇప్పుడే దొరికింది. అదిసరే ఈవిడ గారు దేవలోకపు ఆవిడేనా?
మరయితే ఓ వైపు హిమగిరుని భార్యగా మరో వైపు విశ్వామిత్రుని భార్యగా… వేరు వేరు సందర్భాల్లోనే అయుంటుందనుకోండి. కానీ ఏమిటో ఈవిడ చాలా కాంప్లికేటెడ్ పర్సనాలిటీలా ఉంది. ఎవరికయినా తెలిస్తే చెపుదురూ హిమగిరునితో ఈవిడ వ్యవహారం .. ఇంతటి కథానాయికపై ఒక్క కావ్యం కూడా లేకపోవటం ఆశ్చర్యమే.
ఉన్నా నాకు తెలియదేమో
1 అడ్డానికి స్లిప్పు ఇచ్చుకోండి ఎవరన్నా! ఈజీగా ఉండాలనేది కండిషను!
సుజాత గారు,
పయిన ఒక స్లిప్పు సులువుగానే ఉందే… సరె మొదట ఒకటి నిలువు వచ్చిందా??
1 నిలువు పుణ్యవతి అంటా… అంటే ‘ధన్యా’త్మురాలే..
1 అడ్డం దర్శనమయుతే వెంకన్న కరుణిస్తాడు గాని, ‘దర్షణా’నికి వెళితే, తిరస్కారమే ఎదురవుతుంది,
ఇప్పుడు వెలిగే ఉంటది కదా! లేకపోతే మీ అత్తగార్ని దర్శించండి, దర్షణం ఎదురవుదులేండి
15 అడ్డం: అనగానేమి?
@వికట కవి గారు,
45 అడ్డం మూడో అక్షరం ‘క ‘ కదా! ఎందుకంటే 40 నిలువు-పొగ బెట్టడానికి కావలసింది పొట్టులాంటిదే కదా (అది క్లూలోనే ఉంది చూడండి!)
అలా అయితే 40 అడ్డం ‘గ్రామం(పర్యాయ పదాలు వెదకండి) నుంచి వచ్చిన వాడు ‘ అనా? అలా అయితే 45 అడ్డం కుదరాలిగా?
ఏమిటో అంతా రామ మయం!
దైవానిక గారు,
థాంకులు! ఇంకా ఏవైనా స్లిప్పులుంటే మొహమాట పడకండి! పంపించండి , రాసుకుంటాను.
@ సుజాత,
కప్పీ అనగా గిలక లేదా అలాంటిది. కానీ అన్నివైపుల నుంచి వచ్చిన ఆధారాలతో ఎప్పుడూ వినని ఓ వింత పదం తయారయింది. బహుశా అదే కరెక్టేమో. 1,3 అక్షరాలు ఎలాగూ ‘ క ‘ గుణింతంలోవే. 2వ అక్షరానికి 2 నిలువు క్లూ ఉండనే ఉంది.
మీ 45 అడ్డం తప్పేమో. మూడోది “క” కాదు, “ద”.
@సుజాత
40 అడ్డం మీరు ఊరికే అనుకున్నా సరియైనదే.
40 నిలువు అదరగొట్టటం, ఇదరగొట్టటం వరసలో తర్వాత పెట్టేదే కొంచెం శ్రమపడకుండా.
@ వికటకవి: పేరు క్రాస్ చెక్ చేసుకోవడానికి విశ్వామిత్రుణ్ణి అడగమన్నాను. ఎంతైనా ఆయనకు తపోభంగం చేసింది ఆపేరుగలావిడే కదా? పేర్లొక్కటే గానీ, ఆమె వేరు, ఈమె వేరు (అట). అప్సరసే శాపవశాన మానవావతారమెత్తి హిమవంతుణ్ని పెళ్ళాడిందని కూడా అంటారు.
@ సుజాత: 1 అడ్డం కోసం ‘తిరస్కారము’ అనే పదం బ్రౌణ్యంలో ఎక్కడెక్కడ వస్తుందో వెదికి చూడండి.
45 అడ్డానికి పైన రెండు మూడు స్లిప్పులున్నాయి చూడండి. ఇంకా ‘కడుపు’ నిండకపోతే అడగండి.
40 అడ్డం భలే కనిపెట్టారండీ. 40, 45 అడ్డాలు వచ్చేస్తే మూడు నిలువులు దిగినట్లే.
@ వికటకవి: ‘కప్పీ అనగా’ అని మీరు రాసింది కరెక్టే కదా? అది చిన్నప్పట్నుంచి వింటున్న పదమేనే? మొదటి అక్షరం క గుణింతంలోనిది ఎలా అవుతుంది?
@ చిలకపాటి శ్రీనివాస్: 40 అడ్డం ఫలానా అని మీరు ధ్రువపరిచాక నిలువులు వాటంతట అవే వచ్చేశాయి. థాంకులు.
శ్రీనివాస్ గారు,
అవును, అదర , ఇదర, –దర. వచ్చింది.
సుగాత్రి,
45 అడ్డం వచ్చాక దాని తాలూకు నిలువులు వచ్చాయి.
10 నిలువు కి మూడో అక్షరం తప్ప లింకులు కలవలేదు.
9 అడ్డం డౌటు
మొత్తం మీద ఈ సారి కనీసం తప్పులతో పంపించిన వారి లిస్టులో కూడా నా పేరుండదని నమ్మకంగా ఉంది.
మంచు మౌంటెన్ బాబు గారి కథ మీరు కాబట్టి పట్టుకున్నారు. అభినందనలు.
@ సుజాత,
10 నిలువా లేక 6 నిలువా? 6 నిలువుకి సమాధానం ఆధారంలోనే ఉంది. కాకపోతే, అటూఇటూ అయ్యాయి. 4,8,10 అడ్డాలు వస్తే మిగిలింది ఒక్క అ”క్షే”రమే కదా. ఇక 9 అడ్డం నేను తప్పులో కాలేసానని అనుమానం. నేననుకున్నఏమంటే, ఇహం కానిది.
@ సుగాత్రి,
ఏమోనండి, 9 నిలువు దోషమేమో?
వికటకవి గారు,
సారీ, నేను అడగాలనుకున్నది 10 అడ్డం సంగతి! నిలువు అని రాసాను.
వామ్మో నేనింకా మొదలే పెట్తలేదు .. ఇక్కడ అప్పుడే 40 స్లిప్పులా! ఊరికే ఒక లుక్కేశాను యధాలాపంగా. పైన కామేశ్వర్రావుగారన్నట్టు రానారె సామాన్యుడు కాదు!
కొత్తపాళి గారు,
మీరొక లుక్కేస్తే చాలదా? ఈ నలభై స్లిప్పులూ మీ ‘అర లుక్కు ‘కు సమానమని మీకు తెలియకనా?
@ సుజాత,
9 అడ్డం: అంతిమము లో ఒకసారి ‘మ’ ను ‘య’ చేసి ముందు అక్షరంతో కలపండి.
10 అడ్డం: ధర్మాన్ని పాటించేవాడు కార్మికుడు లా అనిపించే ధన్యాత్ముడే. కాదంటారా?
@ వికటకవి,
6 నిలువులో మిగిలింది ‘ని’ కాదా? ‘క్షే’ అంటారా?
9 నిలువు దోషం? కావచ్చు.
@కొత్తపాళీ,
తొందరగా మొదలుపెట్టండి ప్లీజ్. మీరొక్కరే నలభై స్లిప్పులైనా ఇవ్వాల్సి వచ్చేలా ఉంది ఇక్కడి పరిస్థితి.
9,10 అడ్డాలు నేనూ సుగాత్రిగారన్నవే వేసాను.
15 అడ్డం వికటకవిగారు చెప్పారు.
9 నిలువు, తక్కిన అడ్డాలన్నీ వస్తే వచ్చేస్తుంది కదా. అక్షరాలు తడబడ్డాయి.
11 నిలువే అనుమానం, abbreviation ఏమోనని.
@ కామేశ్వరరావు గారు,
11 నిలువు: abbreviation!? కొంపదీసి మనేకా గాంధీ గారి మొగుడి గారి పని కాదుగదా?
అదే కరెక్టనిపిస్తోంది. కానీ ధ్రువపరచుకోవడానికి ఆధారంలో చిన్న హింటుగానీ, రెండో అక్షరానికి లింకులుగానీ లేవే?
[...] మనేకా గాంధీ ఎవరా? -ఓవర్ టు సుగాత్రి గారి బ్లాగు! [...]
హమ్మయ్య! 11 నిలువుకు కన్ఫర్మేషను ఏకంగా పొద్దు వారి వార్తాహరి తొలికోడి నుంచే వచ్చేసింది. అంతే కాదండోయ్, మీరు గమనించారో లేదో పొద్దు సార్ల సొంత బ్లాగుల్లో కూడా గడి ఆధారాలకు స్లిప్పులిస్తున్నారు ఇన్ డైరెక్టుగా. http://avee-ivee.blogspot.com/2008/06/blog-post_11.html ఈ టపాలో రెండు ఆధారాలకు (46 అడ్డం, 4 అడ్డం) స్లిప్పులున్నాయి. ఈ టపా గడి కోసమే (46 అడ్డం) రాశామంటున్నారు. మరి దాంట్లోనే 4 అడ్డానికి స్లిప్పు రావడం కాకతాళీయమనుకోవాలా!?
11 నిలువు మనేకా గాంధీ మొగుడి గారి పనే! సందేహం లేదు. FP అంటే Fair price అని తెలీక 11 నిలువు లాగే తెనిగించాను ఒక సారి!
14 అడ్డం కొంచెం డౌటుగా ఉంది
@ సుజాత గారు,
గడిలో 14 అడ్డం లేనేలేదే? ఉన్నది 14 నిలువు కదా?
ఇంకా తెలీకపోతే ‘చాణక్యుడి తండ్రి ‘ అని ఎరుగు! అంటారా సుగాత్రి గారూ
ఈ గడికట్టు కూడా రానారె మాదిరిగానే వుంది. కాంప్లెక్సిటీ జాస్తి. కన్ప్యూజవుతున్నాడో చేస్తున్నాడో అర్థంగాదు.
ఐనా, నేను మాటల జెప్పే మనిషినేగానీ మీ అందరి మాదిరి ప్రయత్నించి గడి పూర్తిజేసే రకం గాదు. ఇంతకూ ఒక్కరన్నా పూర్తిజేసినారా?
కడప:
సుగాత్రి: బాగుందండీ కవిత. గడి ఆధారాలతో తాపీగా కవితలు కూడా రాసేస్తున్నారు, ఓ పక్కన గడువు తేదీ ముంచుకొస్తోందండీ! అన్నట్టు, ఆధారాలన్నీ కవితలే ఇస్తూ పొద్దులో ఒక గడి కూర్చరాదండీ?
గడికి ఇంకా నాలుగురోజులే గడువుంది. ఇప్పటిదాకా అందిన పరిష్కారాలు మాత్రం రెండంటే రెండే. వాటిలో కూడా తప్పులెక్కువున్నాయి. పంపనివాళ్ళు, పంపాలనుకుంటున్నవాళ్ళు త్వరపడండి.
@ సుజాత గారు,
ఆ విషయం మీరు చెప్పేవరకూ నాకు తెలీదు. నెనర్లు.
@ కడప గారు,
మీకు రానారె గారు బాగా తెలిసినట్లుందే?
@ చదువరి గారు, & త్రివిక్రమ్ గారు,
మీ తొందర అర్థమైంది. ఇక మేమూ త్వరపడుతాం.
@ చదువరి గారు,
ఏమన్నారు? గడి నేను కూర్చడమా? బాబోయ్! నన్నొదిలేయండి.
సుగాత్రి,
24 అడ్డం నాకో వింత పదం వస్తోందేమిటండి?
@ సుజాత,
వింతపదమా? అలా రాకూడదే?
సత్యం ‘వ’ద అన్నారు కదా స’దరు’ సమాధానం సులభంగా వచ్చేసి ఉండాలే? విసుగెత్తించే ఆ లక్షణం ‘పోతు’ తోడిదే గానీ రాజావారిది కాదు.
ఇంకా రాకపోతే నిలువుగా ఒక రాయేసి చూద్దాం.
24 గుడి లేని విలువలు తలకిందులై సగమయ్యాయట.
25 ‘సరదాగ మేము నడిచొస్తే, …’ ఆపై ‘భారతీయులకు’ వొణుకు పుట్టకేంజేస్తుందీ?
17 మనం రోజూ వాడే పదమే కదా?
సుగాత్రిగారు,
25 నిలువు కి తప్పులో కాలేశాను. దాన్ని దేవుడి పట్ల చూపించేది అనుకున్నాను. ఇప్పుడు దార్లోకొచ్చాను.థాంకులు.
మమ సుజాతగారూ!
మీరండీ ఉండాల్సినవాళ్ళు. “గడి ఖఠినంగా ఇచ్చారు, పారిపోతున్నా” అంటూ మొదలుపెట్టి మీరే అందరికన్నా మిన్నగా పూరించారే! వేసుకోండి వీరతాళ్ళు. రానారె గడితో పోలిస్తే ఈసారి కామేశ్వరరావుగారిచ్చిన గడి సులభంగానే అనిపిస్తోంది. చూద్దాం ఇంకో టపాలో.
నిజంగానే ఉండాల్సిన దాన్నే సుగాత్రి గారూ! అందరి దగ్గరా కొట్టేసిన స్లిప్పులే ఎక్కువ నేను సాధించిన వాటికంటే! గడి పూరించే సుజాత ని నేనొక్కదాన్నేగా, ఇక్కడా నాకు ‘మమా’ అవసరమంటారా!
అయినా సుగాత్రి గారూ ఒకటి చెప్పండి, అందరికీ స్లిప్పులందించి మమ్మల్ని ఆడించి, మీరు మాత్రం సూత్రధారి వలే తెరవెనుక (గడి పంపకుండా) ఉండటం భావ్యమా! అసలు నాకో డౌటు! మీరు కూడా పొద్దు సార్లు, మేడం లలో ఒకరేమోనని!
సుగాత్రి గారూ, సుజాత గారూ, జూలై గడి కోసం స్లిప్పుల సర్వీసు ఆరంభించండి, దయచేసి . నేను ఇంతకు ముందు రానారె గారి కూర్పుకి పాల్గొనలేదు, కొన్ని క్లూ లు దొరికినా..ఇప్పుడు పాల్గొంటాను.
నాకు కేవలం 5 మిగిలాయి. కాబట్టి మీకు కావలసిన సమిధలు అందించడానికి రెడీ..
సుజాత గారూ,
స్లిప్పుల సర్వీసులో కూడా (అంటే నా ఉద్దేశం అందించడంలో అని) మీరే కదా ముందున్నది? నిజమే, మీకు ఇక్కడ మమ అవసరం లేదు.
రవి గారూ,
అక్కడ మీ వ్యాఖ్య చూసి ‘మందమతిని, ఈసారి స్లిప్పులు అవసరం లేదన్నమాట ‘ అనుకున్నాను. మీరే ప్రారంభించమన్నాక ఇక ఆగడమెందుకు?
సుగాత్రి గారు, వేరే టపా ప్రారంభించండి.
కాస్త వీలుచిక్కి జూలై గడిని లాగుతున్నా..బాబ్బాబు స్లిప్పులు మాత్రం అందించకండి ప్లీజ్