గడి గడువులో రోజులు కరిగిపోయి గంటల్లోకి వచ్చేసింది. ఈసారి కూర్పరి భైరవభట్ల కామేశ్వరరావు గారు. గడి చాలా వీజీగా ఇచ్చామని వారన్నారు. పొద్దుపెద్దలు చాలా ఉదారంగా “కాఫీ బెల్లు” ప్రకటించేసి కళ్లు మూసుకున్నారు. ఐనా ఎక్కడా చడీ చప్పుడూ లేదేమి చెప్మా? మరి మాస్ కాపీయింగు చాపకిందనీరులా నిశ్శబ్దంగా సాగిపోతోందనుకోవాలా? ఏమీ అర్థం కావడం లేదు. నా బ్లాగులో కిందటి నెల గడి గురించి రాసిన టపాలో సుజాత గారు అడిగిన/ఇచ్చిన ఆధారాలు ఇక్కడ ఇస్తున్నాను. రేసులో వెనుకబడ్డవాళ్ళు ఇవి అందుకుని అల్లుకుపొండి.
28 అడ్డం: పక్షీంద్రుడు. పేరుకు రాజైనా విష్ణుమూర్తికి బంటేనటండీ, పోతరాజు చెప్పాడు.
33 అడ్డం: “రోములో ఉన్నప్పుడు రోమంగాడిలా పలకమన్నారు” కదా? ఇంతకంటే ఎక్కువ చెప్తే ఎంత టీ తాగుతున్నా ఇన్విజిలేటర్లు ఊరుకోరేమో!
28, 33 అడ్డం వస్తే 19 నిలువు వచ్చినట్లే కదా?
అలాగే 29 నిలువు కూడా!
4 అడ్డం (దీనికి సగం అక్షరాలు కలిసాయి) అబ్బూరివారి పేరు చెప్పి గూగులమ్మను అడిగి చూడండి.
20 అడ్డం..! ‘వాణి నా రాణి ‘ అన్నాడీయన. శివుడి అనుచరుడే!
43 పెద్ద శబ్దం
మాస్ కాపీయింగూ లేదూ, పాడూ లేదు. బుర్ర పట్టుక్కూచున్నాను నేను. 4 అడ్డం కి ఓ చిన్న స్లిప్పు.
‘క ‘ందుల ‘వ ‘రాహ ‘న ‘రసిమ్హ శర్మ గారి కలం పేరుని ‘కుతూహల ‘ంగా పరిశీలించి చూడండి
12 అడ్డం: దీన్ని వాకిట్లో చల్లి ముగ్గు పెడతాం. ధనుర్మాసంలో ప్రతిరోజూ!
34 అడ్డం: మా ఇంట్లో పాత కాలెండర్లో రాముడు సీతని ఇక్కడే కూచోబెట్టుకుంటాడు.
30 అడ్డం: నులక మంచం అల్లేవారిని ఆ ‘పని ‘ గజిబిజిగా ఉంటుందనిపిస్తుంది.
ఎవరైనా నాక్కొన్ని స్లిప్పులు పారేయండి! లేదా పైన చెప్పినవి కాక మిగిలినవి కూడా ఇప్పటికే పట్టేస్తే పూరించి పంపించుకోండి. చూస్తూ కూచుంటాను!
కామేశ్వర రావు గారు మరికొంచెం గడువిస్తే బాగుండు.
4 అడ్డం: వావ్! పట్టేశారన్నమాట!
33 అడ్డం: రాయలసీమలో ఎక్కడికి అని అర్థం వచ్చే ఒక ఊరి పేరు.
>>12 అడ్డం: దీన్ని వాకిట్లో చల్లి ముగ్గు పెడతాం. ధనుర్మాసంలో ప్రతిరోజూ!
మరీ అంత చిక్కగా చల్లకూడదేమోనండీ! కాస్త తేలిగ్గా ‘చలాలి’.
సుజాత గారూ!
మీకు ఇంకా ఏ కొచ్చెనుకు స్లిప్పులు కావాలండీ? నాకు ఆదిలోనే హంసపాదు పడింది. 1 అడ్డం.
మీక్కూడానా! 1 అడ్డం నాకూ తేల్లేదు. నిలువు తేలింది.
19 నిలువు తేల్లేదు.
13 అడ్డం (-శు-లు) ఇలా ఆగిపోయింది
2 నిలువుకి స్లిప్పు! నక్క దేనికో చిక్కుతుందన్నారుగా! దానికి పొక్కిలి పాపడి చేసే పనిలో మొదటక్షరాన్ని కలిపితే సరి!
12 అడ్డం: అవును, కరెక్టే!
23 అడ్డం వచ్చిందా మీకు? గుర్తు రావట్లేదు నాకు (వెయ్యి సార్లు కన్యాశుల్కం చదివినా)
సుజాత గారూ!
గడువు పొడిగింత గురించి మీ కోరిక పొద్దుపెద్దలకు చేరవేశాను. పరిశీలిస్తామన్నారు. వారి నిర్ణయం తొలికోడి కూతతో తెలుస్తుందన్నారు. మనలో మాట: సాధారణంగా గడి గురించి పాఠకులు ఏ వరమడిగినా (సూటిగా తెలిసిపోయే ఆధారాలు ఇవ్వడం తప్ప) ఇచ్చేస్తార్లెండి. అది వాళ్ల ‘వీక్నిసూ’.
13 అడ్డం: అందని అక్షరాల కోసం ‘పారా’ హుషార్!
కన్యాశుల్కం చదివానన్నారు కాబట్టి బాగా గుర్తు తెచ్చుకోండి. మొదట్లో చప్పున గుర్తుకురాక నేనూ తెగ గింజుకున్నాను. రెండు నిలువులు (17,18) తగిలాక వెలిగింది. కూర్పరి కామేశ్వరరావుగారికి వందనాలు.
19 నిలువు: 28,33,37 అడ్డాలు తేలినట్లైతే రెండో సగం ఇప్పటికే వచ్చేసుండాలే? మొదటి సగం కోసం ఉర్దూలో ‘వయసు’ లెక్కెట్టుకోండి.
23 అడ్డం:
[...] కీబోర్డులు దులుపుతున్నారని తెలుగు సాహిత్యం బ్లాగులో ఈరోజు మొదలైన సందడి ద్వారా [...]
హమ్మ! కొంతలో కొంత నయం! ఇహ ప్రయత్నిద్దాం! సుగాత్రి గారు, థాంక్యూలు!కొన్ని సార్లు తెలిసినవైనా సమయానికి బుర్రలో లైటు ఫిలమెంటు కాలిపోయి వెలగదు. చూస్తాను మరి!
సుగాత్రిగారు నెనరులు.
చాలా సులువుగా ఇచ్చేసాననుకున్నాను కానీ, ఇక్కడ మీ తర్జనభర్జనలు చూసాక నా కడుపు కాస్త నిండింది:-)
చక్కని Dumb-charades ఆట చూస్తున్నట్టుంది!
1 అడ్డానికి స్లిప్పు కావలెను.
1 అడ్డం: 1 నిలువు తెలిస్తే మొదటి అక్షరం వచ్చేసినట్టే! ఇక రెండో అక్షరం పిలిస్తే వచ్చేస్తుంది.
శ్రీనివాస్ గారు, 1 నిలువు వచ్చేసింది! కాబట్టి మొదటి అక్షరం వచ్చినట్టే! కానీ మరి పిలిస్తే వచ్చే అక్షరం కలిపితే కలానికి జీవాన్నిచ్చేదనే అర్థం రావడం లేదూ!దాన్నెత్తుకుని మందెలా కొట్టడం?
శ్రీనివాస్ గారు, అర్థమైందర్థమైదండోయ్
చిలకపాటి శ్రీనివాస్ గారు, చమత్కారం అదిరింది!
నాకు 38 నిలువు, 46 అడ్డం తప్ప మిగతా అన్నీ వచ్చాయి (అనుకుంటున్నాను)
కొత్తపాళీ గారు,
మీకు స్లిప్పిచ్చే ధైర్యం చేస్తున్నాను!
38 నిలువు….’అనుకోకుండా ఒకరోజు సినిమాలో చార్మి పేరు! ‘వెయ్యి ‘ సార్లు ఆలోచించాను ఈ స్లిప్పుకి.
అమ్మో, మరీ ఇంత బాహాటంగా ఒకరిదొకరు రాసేస్తున్నారేమిటి…
జరుగుతున్న తతంగమేమో మేష్టారికి ఆటలా కనిపిస్తుందా!
సుజాత గారు, ఛార్మీ గొడవ తెలీదు గానీ .. మాత అదే అనుకున్నా నేను .. లెక్క తేలాలి గదా
మాత కాదు, మాట
సుజాత గారు,
23 అడ్డానికి స్లిప్పు, మీరు us లో ఉన్నప్పుడు ‘బార్బ’క్యూస్ కి వెళ్ళేవారా?
దైవానిక గారు,
నేను అదే అనుకున్నాను గానీ, నిలువు కలుస్తుందా లేదా అని చూస్తున్నానండీ! ధన్యవాదాలు! మీది పూర్తయిందా!
@ కొత్తపాళీ:
ఓ! చివరికి మీరు చివరి వరుసలో చిక్కుపడ్డారన్నమాట!
46 అడ్డం: అంపశయ్యమీద పడుకుంటే చివరకు మిగిలేదేమిటి? రుధిర ధారలని మాత్రం అనకండేం!
@ సుజాత:
గడిలో నకారం పొల్లును విడి అక్షరంగా లెక్కించరండీ. ఉదాహరణకు ఫంక్షన్ అని రాయడానికి రెండు గళ్ళే ఇస్తారు.
సుజాత గారు, నిలువు కలుస్తుందండి. నాది ఇంకా అవ్వలేదు. ఒక 80% అయ్యిందని చెప్పాలి.
సుగాత్రి గారు, కేవలం నకారం ఒక్క దానికేనా ??? ఫోకస్ అనేది కూడా రెండక్షరాలే కదా??
>> ఫోకస్ అనేది కూడా రెండక్షరాలే కదా??
అవునండీ దైవానిక గారూ! “గుడ్ లక్” కూడా రెండక్షరాలే (1+1).
సుగాత్రి గారు,
అవునా! అదీ సంగతి! 28 అడ్డం, 19 నిలువు తేల్లేదంటే మా అత్తగారు ఫోన్ చేసి మరీ ‘నగుమోము ‘ తో చీవాట్లు పెట్టారు. అప్పుడు తెలిసింది మన బుర్ర ఎంత స్లో గా పనిచేస్తోందీ
@వీవెన్:
ఏదో గడి నింపడానికి మా పాట్లు మావి, మా టెక్కునిక్కులు మావి. మీరిలా స్పెషల్ స్క్వాడ్ లా వచ్చి అడ్డుపడితే ఎలా?
@సుజాత:
మీ అత్తగారు కూడా బ్లాగులు చదువుతారన్నామాట. గ్రేట్! ఆమె కూడా బ్లాగరేనా?
@సుగాత్రి:
గతంలో గడి గురించి కొత్తపాళీ గారి బ్లాగులో చర్చోపచర్చలు జరిగేవి. ఇప్పుడేమో మీరు గడిబిడ చేస్తున్నారు.
కానీ ఒక్కసారి కూడా పొద్దుకు మీ పరిష్కారాలు పంపలేదేం?
సుగాత్రి సరస్వతీదేవి వరాన పుట్టినదట. నాకు ఈమాట కేవీయస్ రామారావుగారు చెప్పారు. ఆయనకు ఈమాట కతరాజు చెప్పారట. ఈ కతరాజెవరంటారా? కనుక్కోండి చూద్దాం.
సుగాత్రి .. టోపీ తీసేశాం. ఇంతవరకూ తట్టనందుకు నన్ను నేనే .. వొద్దులేండి.
పాపం వీవెన్ మనకి అడ్డుపడటంలా .. మంచి బాలుడు కదా, జన్మలో ఎప్పుడూ కాపీ కొట్టి ఉండడు – అందుకని హమ్మో అని బుగ్గలు నొక్కుకుంటున్నాడు, అంతే!
సుజాతా .. ఇక్కడ వెబ్బులో ంఆస్ కాపీయింగ్ కాకుండా ఫోనులో అత్తగారిచ్చే స్లిప్పులు కాడానా .. పెట్టి పుట్టారండీ.
రానారె .. నాయనా ఒక పక్క ఈ గడినే సాధించలేక జుట్టు పీక్కుంటూ ఉంటే మధ్య నీ పిడక్ల వేట ఏంటి?
సుజాత గారూ 13 అడ్డం వచ్చిందా లేదా? ఈ మధ్యనే మీ టపా ఒక దాంట్లో అరవ్వాళ్ళని ఆడిపోసుకుంటే వీటి ప్రస్తావన తెచ్చాను నేను.
నాకు ఒకటి చాలా ఆశ్చర్యంగా ఉంది – 10 అడ్డం, 27 నిలువు, 39 అడ్డం వంటివి జనాలకి కష్టంఘా ఉంటాయేమో ననుకున్నాను, గానీ భక్తులెవరూ వాటి మాట యెత్తలేదంటే .. అందరూ బాగా తెలుగు మీరి పోయారన్న మాట .. సంతోషమే!
10 అడ్డానికో స్లిప్పు ఇద్దురూ, చూడబోతే ఏదో పద్యపాదంలో చెప్పినట్లుంది? అంతేనా లేక టీచరు గారే అలా చెప్పారా?
వద్దులెండి, తెలిసింది
ప్రజలారా, నాకు 10 అడ్డానికో స్లిప్పు ఇచ్చి పుణ్యం కట్టుకోండి … చూస్తే దృష్టద్యుమ్నుడి చెల్లెల్లా ఉంది.
10 అడ్డానికో బ్రహ్మాండమైన స్లిప్పు. స్లిప్పు అర్థం కాక, ఒరిజినల్ క్లూ యే నయమనుకోవాలి మరి.
దైవానిక గారు, మీ ఊహ కరక్టే! ‘జన్న ‘ మును ప్రక్రుతి లో నిలిపి దాని వెనకే తెలుగు ‘ఆర్మీ ‘ లా నుంచోండి.
కొత్తపాళీ గారు,
13 అడ్డం సగం వచ్చాక, సుగాత్రి గారి స్లిప్పుతో పని జరుపుకున్నాను.
27 నిలువు , 39 అడ్డం అదేమిటో ఎవర్నీ హెల్ప్ అడక్కుండా మొదట్లోనే వచ్చాయి.(విచిత్రం)
రానారె గారు,
‘పాప ‘ రాజు గారా?
@ త్రివిక్రమ్: ఒక్కసారైనా పూర్తిగా నింపలేకపోయాను. అందుకే పంపలేదు.
@ రానారె: పింగళి సూరన?
@ కొత్తపాళీ: నెనరులు.
@ దైవానిక: మీ ఊహ కరక్టే! 10 అడ్డానికి సమాధానం సుజాతగారిచ్చిన స్లిప్పు పట్టుకుని కొంచెం రీసెర్చి చేసి మరీ కనుక్కున్నాను. మీకో క్లూ: ధృష్టద్యుమ్నుడి తండ్రికింకో పేరుంది. ఆ పేరు వెనుక పడండి. మీ పని సులువైపోతుంది.
@ సుజాత:
సుగాత్రి గారు,
నవీన్ రాసిన పుస్తకాలు నా దగ్గర 4 ఉన్నాయి భీష్ముడు గారి ముళ్ళ బెడ్డుతో సహా! అందులో 46 అడ్డం లేదు. వెదుకుతా లెండి, ఆదివారం దాకా టైముందిగా!
సుజాత గారూ!
46 అడ్డం: ముళ్ళబెడ్డు నిండా ఉన్నది అదే కదండీ? అసలు ముళ్లబెడ్డే దాంట్లో ఉందంటారే?
సుగాత్రి గారు,
కానీ అదేనంటారా? ఈ ఒక్కటీ ఆ పేసింది నన్ను! నవీన్ అలాంటి (మీరు అందించిన స్లిప్పు ప్రకారం) పుస్తకమేం రాసినట్టు లేదే! గడిలో ఇచ్చిన clue కి సరిపోయేలా ఒక పుస్తకం రాశారు. కానీ ఒక్క అక్షరం తేడా వస్తోంది! ” లోపల ఉండే ప్రవాహం ‘ ని విశ్లేషించి చూడండి! ఆ పుస్తకం నా దగ్గరుందండి!
ఈ క్లూలూ, క్లూలకి క్లూలూ చదువుతూ ఉంటే నాకు తెలియని విషయాలెన్నో తెలుస్తున్నాయి. చాలా విజ్ఞానదాయకంగా ఉంది!
రానారెగారి పిడకలవేటకి జవాబు పింగలిసూరనలానే ఉందికానీ అతన్ని కతరాజనడం వెనక ప్రత్యేకమైన కారణమేవైనా ఉందా?
నా పిడకలవేట వ్యాఖ్యలో ఒక మాట రెండుసార్లు దొర్లింది. ఆమాటను పట్టుకుని అక్కడ వెతికితే కతరాజెవరో, అతన్నెందుకలా అన్నారో కొంతవరకూ తెలుస్తుంది.
అబ్బ వచ్చిందండి.. సుగాత్రి గారు, సుజాత గారు, నెనర్లు
@ రానారె గారు,
ఓహో, ఈ మాట పట్టుకుని వెదకాలన్నమాట! పొద్దు పజిలయ్యాక చూస్తాము లెండి. అదీ కాక, ఈ పొద్దు ఈమాట డౌన్ అయ్యింది ఎందుకో!
సుజాత గారూ!
46 అడ్డం: ఒక అక్షరమైనా తేడా ఎందుకు రాదు సమాధానం అది కాకపోతే? మీరలా ముక్కుసూటిగా వెళ్ళేవాళ్ళైతే ప్రవాహం లోపలుందా బయటుందా అని కాక దాని నైజమేమిటో ఆలోచించండి. అప్పటికీ రాకపోతే మీ అత్తగారే మిమ్మల్ని గట్టెక్కించాలి.
కామేశ్వరరావుగారూ!
మీకు అలా అనిపిస్తోందా? ఐతే ఈ బ్లాగు ధన్యమైపోయినట్లే. (ఆర్భాటంగా బ్లాగు మొదలుపెట్టేసి ఏమీ రాయకుండా వదిలేశానని గిల్టీగా అనిపిస్తూంటుంది నాకు.)
రానారె గారూ!
తెలిసింది.
దైవానిక గారూ!
అభినందనలు.
ఏప్రిల్ గడి ఫలితాలు వెలువడ్డాయి చూశారా? మన సిరాలు, సిక్కులు సరైన సమాధానాలు కావట. ఇంకునెవరూ (బహుశా సుజాతగారు తప్ప) ఎత్తుకోలేదని వదిలేసినా సిక్కును మాత్రం సాగదియ్యకుండా ఉండనిచ్చారు.
సుజాతగారూ! 46 అడ్డం సరిచూసుకున్నారా?
మొత్తానికి ఈ గడిపైన నడచిన ఈ స్లిప్పులపర్వం ఇంత సందడిగా, ఇంత రసవత్తరంగా సాగినందుకు చాలా సంతోషంగా ఉంది. గడి కూర్పరే స్వయంగా ఈ చర్చలు నడుస్తున్న విధానాన్ని అభినందించారు. ఈ అభినందనలు ఈ టపాకు వ్యాఖ్యలు రాసినవారందరికీ చెందుతాయి. ఈ టపా రాయడానికి, దానిమీద ఇంత భారీస్థాయిలో చర్చలు జరగడానికి ప్రేరణ, కర్త, క్రియ సుజాతగారే. ఆమెకు నా కృతజ్ఞతాపూర్వక వందనాలు. ఇక ఈనెల గడి కూడా పొద్దెక్కింది. దానికి గడువు కూడా రెండువారాలే ఉంది. ఇక మన గడబిడ మొదలెడదామా?
సుగాత్రి గారు
ఆల్రైటుగా మొదలెడదాము! చాలా వరకు వీజీగానే “ఉన్నట్టున్నాయి ” 6 నిలువు చూడండి ఎంత కష్టంగా ఉందో! ఈ సారి కొత్త పాళీ గార్ని స్లిప్పులడగలేము వారే సృష్టి కర్త కావడం వల్ల!
46 అడ్డం చూసుకున్నాను. నవీన్ రాసిన అంతస్స్రవంతి నవల ఉంది నా దగ్గర. దాని గురించే నేను మీకు రాసింది.
దొంగకి తాళం చెవులు ఇవ్వడమంటే ఇదే మరి. పొద్దుసార్లు భలే ఎత్తువేసారు??
..
కొత్తపాళిగారిని ఇరికించేసారు. స్లిప్పులు ఇవ్వకుండా. ఎన్ని నెలలనుండి గమనిస్తున్నారో కదా! ఐనా మనం ఆగుతామా కాపీ కొట్టకుండా????
సుగాత్రి ఉవాచ:
ఈ టపా రాయడానికి, దానిమీద ఇంత భారీస్థాయిలో చర్చలు జరగడానికి ప్రేరణ, కర్త, క్రియ సుజాతగారే.
“క(ఖ)ర్మ” మాత్రం మనది, అంతేనా సుగాత్రి గారూ?
kottapaaLI gaaru,
idi chaalaa anyaayam!
ఈ సారి కూడా నాకు పెద్దగా వీజి ఏమి అనిపించలా.. కాని ఒక 50% అయ్యాయి. ఇంకా టైం ఉందిగా .. మనం మెల్లగా కాపీలు మొదలెడదాములెండి.
దైవానిక గారు,
నాకు 2 తప్ప మిగిలినవి అన్నీ వచ్చేసినట్టే! నెలాఖరుకు అవి దొరక్కపోతే, పంపడం కుదరదు.నెలాఖరుకు హైదరాబాదు పయనం!(shifTing) మీకు స్లిప్పులు వేటికి కావాలో ఈలోపే అడగండి మరి…నాకొస్తే ఇస్తా!
కొత్తపాళీ గారి ఉవాచ:
“క(ఖ)ర్మ” మాత్రం మనది, అంతేనా సుగాత్రి గారూ?
కొత్తపాళీ గారూ, అది చేసుకున్నవారికి చేసుకున్నంత కదండీ!
సుజాత గారూ, కూర్పరినే స్లిప్పులడగడంలోనే కదండీ సాధకుల గడుసుదనం వెల్లడయ్యేది?
జ్యోతిగారూ! పొద్దుసార్ల ఎత్తులకు పైయెత్తులు వేసే వంతు ఇప్పుడు మనదే కదండీ?
దైవానిక గారూ, టైం ఇక రెండువారాలే ఉంది. సుజాతగారి స్లిప్పులందుకునే అవకాశం ఇంకో వారంరోజులు మాత్రమే ఉంది. “ఆలసించిన ఆశాభంగం” కాబట్టి త్వరపడడం మేలు. నాకు మాత్రం మొదటి విడతగా వీటికి స్లిప్పులు కావలెను:
2 నిలువు, 5 నిలువు, 37 నిలువు, 38 నిలువు, 4 అడ్డం, 8 అడ్డం, 36 అడ్డం, 41 అడ్డం, …
సుగాత్రి, కొత్తపాళీ గార్లు,
స్లిప్పులూ నేనూ ఇచ్చానుగా కొద్దో గొప్పో! మీరిద్దరూ ‘చేసుకున్న వాళ్లకు…’ అనీ ‘ అంతా మన ఖర్మ ‘ అనీ నిర్వేదంగా కామెంట్లిచ్చుకోవడం నాకర్థం కాలేదు. ఇదెలా ఉందంటే మీ స్లిప్పులతో నేను గడి మొత్తం పూర్తి చేసి పంపినట్టుంది.(ఊరికే..నవ్వులాటకి..)
సుగాత్రి గారు,
మీకూ దాదాపుగా నాకు పడ్డ చోటే బ్రేకులు పడ్డాయి. వీటిలో కొన్నింటికి స్లిప్పులు…
5 నిలువు, 8 అడ్డం, 4 అడ్డం నాకూ సగం చిక్కి ఆగాయి.
2 నిలువు: 1 అడ్డం, 10 అడ్డం వస్తే ఇక ఒక్క అక్షరమేగా రావాలసింది. అందుకోసం మధ్యలో అ ‘క్క ‘సుగా చూడండి.
37 నిలువు: దీనికి అనుసంధానం కుదరాలంటే ‘అంభి ‘ కా దర్బార్ బత్తి దేవుడికి వెలిగించాల్సిందే!
41 అడ్డం : మనలాలాగే పద్మవ్యూహంలో చిక్కిన ‘అభి ‘మన్యుడిని కొంచెం ప్ర ‘శంసి ‘ ంచండి
36 అడ్డం: 27 నిలువు, 25 నిలువు వస్తే ఇక రావలసింది ఒక్కక్షరమేగా! చూడండి!
38 నిలువు: 37 అడ్డం, 41 అడ్డం వస్తే 38 నిలువు మనం ప్రయత్నించకుండానే వస్తుంది. కానీ అది క్లూ కి సమాధానమేనా అనిపిస్తోంది.
అవునూ, మా అందరి చేతా మీ బ్లాగులో చెడుగుడు ఆడిస్తూ మీరు పంపరేమిటి? ఇదో కొత్త ఆటా?
సుగాత్రి గారు,
మీకి రాని చాలా వరకు నాకు రాలేదు, కొన్ని స్లిప్పులు తీసుకోండి.
36 అడ్డం అసలు క్లూ లో నే ఉంది. కత’కత కం’గు చిల్లుగింజ మింగు
37 నిలువు, తక్షశిల యువరాజంట, అలెగ్జాండర్ ఫ్రెండంట ఇంక గూగులమ్మ ఉంది ఎందుకు?
సుజాతగారిస్తున్న స్లిప్పులు చూస్తుంటే, ఆవిడ చేత ఓ గడి చేయించవచ్చనుకొంటా. గడిలో మేం ఇచ్చిన ఆధారాలకంటే, ఈ స్లిప్పులే బాగున్నాయి – అంభికాదర్బారు బత్తితో అనుసంధానం, అభిమన్యుడికి ప్రశంస – సూపర్.
సుజాత గారూ – మీకు తోచిన ఆధారాలు పొద్దుకి పంపండి, ఈ సారి ఇచ్చే గడిలో వాటిని పెడతాం.
సిముర్గ్
పొద్దు సార్లు ఎవరు ఎక్కువ స్లిప్పులిస్తున్నారో చూసి వాళ్ళని మా నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అద్యక్షా.
సుజాత గారు, మీరు అటువైపు వెళ్ళినా మాకు స్లిప్పులివ్వాల్సిందేనండి.
సుజాత గారు,
38 నిలువు కలిసిందికదా. నాకు క్లూ కి సరిగ్గా సరిపోయిందే. మీకు అక్కడ ‘సత్తా’ లా ఉన్న చీమే(చీము నెత్తురు లాంటిది) కదా వచ్చింది??? తిరగేస్తె షడ్జము పంచమమూను. అది కాకుంటె మీ 37 అడ్డం తప్పేమోనండి.
37 అడ్డానికి స్లిప్పు: మీరు గడిని ఎక్కడనుంచి చూస్తున్నారు ‘laptop’ లోనా లేక Desktop లోనా?
సిముర్గ్ గారు,
మీ ప్రశంసతో నేను ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఇక్కడ గడులు పూరించడానికే జడ కాస్తా గుర్రప్పిల్ల తోకై కూచుంది. ఇంక గడి తయారు చేయాలంటే అది కాస్తా ఏమవుతుందో అని భయం! మీ ప్రోత్సాహానికి వేన వేల కృతజ్ఞతలు. ప్రయత్నిస్తాను.
అమ్మో! దైవానికా,
మీరు గూగులమ్మని అడుగుతున్నారా స్లిప్పులూ? భేషైన పని. నాకింత వరకూ తట్టలేదు సుమా!
37 అడ్డం వచ్చింది. నాది డెస్క్ టాపే గాని, లాప్ టాప్ ప్రకారమే గడి నింపానులెండి.28,30 నిలువులు వచ్చాక అది మొత్తం పూర్తయింది. దాని ప్రకారం 38 నిలువు పట్టాను. ముందు అది నేను పంచమం కాక దైవతం అనుకున్నాను. అదీ సంగతి!
సరే, 4 అడ్డం, 5 నిలువు,8 అడ్డం కోసం ఎవర్ని పట్టుకుందాం ఆలోచించండి!అన్నట్టు నాకు 19 అడ్డం కూడా సగమే కలిసి డౌటుగా ఆగిపోయింది.
సుజాత గారు,
8 అడ్డం – కరాటేలో తన్నులు ‘పంచి ‘పెడతారు కదా. అదేమోనండి. 5 నిలువు తట్టక ఆగిపోయాను.
గూగులమ్మ, బ్రౌణ్యము లేక పోతే నేను సగం కూడపెట్టలేనండి.
అసలు పొద్దు సార్లు ఇటువైపు రాకుండా చేసింది మేలు.. బాగా చదువుకునే పిల్లలను పట్టుకెళ్ళి ప్రశ్నాపత్రం రాయిస్తున్నారు. ఇది అన్యాయం.. ఇలాగైతే అందరం కలిసి పొద్దు గడిని బ్యాన్ చేసి ఎవ్వరూ పూర్తి చేయం. చేసినా పంపించం.. హన్నా!!!!!!!!!!
జ్యోతిగారు, అంత కఠ్ఠిన నిర్ణయాలు తీసుకోవద్దండీ బాబూ!!! అసలే మొత్తం అంతర్జాలంలో వచ్చే ఒక్కగానొక్క గడి…
8 అడ్డం ఇచ్చిన క్లూలోనే ఉందని నా అనుమానం. కరాటేరా అనకుండా కరాటేడా అని ఎందుకన్నట్టు?
5 నిలువులో కాన్వెంటు పిల్లాడు నాన్ననేమంటాడో వరుకూ వస్తే ఇంకొక్క అక్షరం కలపడమే.
4 అడ్డం వచ్చిందికానీ అది సరైనదా కాదా అని డౌటు. “పెరుమాళ్ళ ఊరంత” అన్నదానికి ఓ పదం, “సంసారం” అన్నదానికి మరో పదం వేసుకున్నాను. కానీ ఇది నేనెప్పుడూ వినలేదు.
4 అడ్డంబట్టి 6 నిలువు వచ్చింది కాని అదీ ఏమిటో నేనెప్పుడూ వినలేదు.
స్లిప్పులు ప్రశ్నలకన్నా కష్టంగా ఉంటే నన్ను క్షమించీండి:-)
కామేశ్వరరావు గారు, 8 అడ్డం లో మీ అనుమానం నిజమే. సమాధానం ఇచ్చిన క్లూలోనే ఉంది. ఇప్పుడే గూగులమ్మని అడిగి చూశా. ఠక్కున ఇచ్చేసింది
4 అడ్డం: చివరి మూడక్షరాలు (సంసారం అనే పదానికీ పర్యాయపదం) వచ్చేసాయి గాని మొదటి మూడక్షరాల్లో మొదటిది తప్ప (అదీ 4 నిలువు వచ్చింది కాబట్టి) తట్టడం లేదు. “పెరుమాళ్ళు ఊరంత ” అనేపదానికి ప్రత్యామ్నాయం, పర్యాయపదం ఏమిటో?
సుగాత్రి, మీరేమంటారు?
సుజాత గారూ!
4 అడ్డం: పెరుమాళ్ అనేది అరవపేరు కాబట్టి ఆ ఊరు కూడా అరవదేశంలోదేమో అని అనుమానంగా ఉందండీ! “కంచి కామాక్షినీ, మదుర మీనాక్షినీ” శరణువేడాలి కాబోలు. కాంతాకారం చంపుతే anagram లా ఉంది కానీ స్పష్టంగా తెలియడం లేదు. కొత్తపాళీ గారూ! F1 ప్లీజ్!! మీరు అటువైపు వెళ్ళాక ఇటువైపు చూడనే లేదు. మరీ ఇలా శీతకన్నెయ్యడమేం బాలేదండీ!
దైవానిక గారూ!
8 అడ్డం: రూటు మార్చి “చాచి” పెట్టి కొట్టారుగా! ఎన్వికీలో కరాటే పట్లు నేర్చుకోవలసొచ్చింది దీనికోసం.
జ్యోతి గారూ!
నేనూ మీతో గొంతు కలుపుతున్నాను. “హన్నా!!!!!!!!!!!!!!!!!!!!!”
కామేశ్వరరావుగారూ!
జ్యోతిగారు పొద్దుసార్ల పద్ధతేం బాలేదని కినిసి అలా బెదిరిస్తున్నారేగానీ నిజంగా గడిని పూరించకూడదని కాదు. కావాలంటే చూడండి ఈసారి కూడా గడిని నింపి పంపినవారిలో ఆమె కూడా ఉంటారు.
5 నిలువు: మీరిచ్చిన స్లిప్పుకు 4 అడ్డం కలుపుకుంటే ఏదో వస్తోంది గానీ సమాధానం అదేనంటారా?
6 నిలువు: అనాగ్రమే కదండీ? మనం విన్నా వినకపోయినా అదేనని సర్దుకుపోవాలేమో వివరణలు చూసేదాకా? :O
సుజాత గారూ,
మీరిచ్చిన స్లిప్పులు నిజంగా బ్రహ్మాండమండి. మీకు నా స్పెషల్ థాంకులు. మీరు ఒకచేత్తో గడి కూర్పర్లకు స్లిప్పులు పంపినా రెండో చెయ్యి మావైపే ఉండాలండోయ్. 19 అడ్డం ఆధారాన్ని బట్టి చూస్తే దాంట్లో రెండు పదాలుండాలనిపిస్తోంది. రెంటినీ కలిపి రాయాలేమో మరి. నాది రెండక్షరాల దగ్గరే ఆగిపోయింది. ముందుకు కదలడానికి నాకు 4 నిలువుకు కూడా ఒక స్లిప్పు బేకు.
ఆంధ్రదేశం లో ఐఐటీ లొ ప్రవేశానికి కోచింగ్లు లిచ్చే సంస్థలలో ప్రవవేశానికి ఇంకో పిల్ల సంస్థ కోచింగుఇచ్చినట్టు, మీ స్లిప్పుల గట్టిదనమో నా భాష ఒట్టిదనమో తెలీదుగానీ, నాకు ఈ స్లిప్పులకి స్లిప్పులు అవసరమౌతున్నాయి… అలంటి టపా కూడా పుట్టిందా బ్లాగ్ప్రపంచంలో?
గడి వారిలానే, ఏ నెలస్లిప్పులు ఆనెలకి కొత్తటపాలో వేస్తే, కాస్త సులువు…
@ సుజాత .. నా చమత్కారాన్ని మీరు అపార్ధం చేసుకున్నారేమో ననిపించింది. సుగాత్రి మిమ్మల్ని కర్త, క్రియ అంటే, కర్మ మాది .. అంటే మీరెంత మంచి స్లిప్పులిచ్చినా మేము వాటిల్ని పట్టుకుని నింపి పంపాలిగదా అన్న ఉద్దేశంలో .. అంతే. బహుశా దాని మీద సుగాత్రి ఇంకో కొసరు వేశారు అనుకుంటున్నా.
@ భక్తులందరికీ .. ఇది నిజంగా పొద్దు సార్ల కుట్రే. ఎందుకంటే ఈ గడిలో నేను కూర్చిందీ లేదు, పేర్చిందీ లేదు. ఏదో లోపాయకారీగా నన్ను సంప్రదించినట్టు సగం పేర్చిన గడి నాకు చూపెట్టేసి అలా ఇరికించేశారు
@వూదం .. హ హ్హ
4 అడ్డం .. సుజాతగారి మొదటి ఊహ కరక్టే. అది అరవ పెరుమాళ్ళు గారి ఊరే. ఇంకో తమాషా ఏంటంటే 4 నిలువులోనూ కనిపించే ఊరదే.
4 నిలువు .. సుగాత్రి .. ఫలితం లేని అరవ చాకిరీకి ఇది బాగా తెలిసిన పదబంధమే.
8 అడ్డం జనాలకి అర్ధమైనట్టే ఉంది.
19 అడ్డం .. సుగాత్రి, మీ అనుమానం కరక్టే
సుగాత్రి గారు,
4 నిలువుకి ఒక స్లిప్పు
కథలు చేరే చోటట.. కథ అక్కడికి మనమింటికి అంటారు కదా.. అక్కడ ఖగరాజు ఉత్సవం బాగా ప్రసిద్దికెక్కింది లెండి. అందుకే పాపం అతని పాట్లు
4 అడ్డం నాకింకా వెలగలేదు మరి. 4 నిలువులో ఉన్న ఊరు 2 లేక 4 అక్షరాలతో వస్తుంది. ఎటు కాక మూడులో ఎలా ముగించాలో
19 అడ్డం ఏదో తూచాగా కలిసింది. మీ అనుమానం నిజమే
వూకదంపుడుగారూ!
ఇకనుంచి అలానే చేస్తాను.
కొత్తపాళీగారూ!
మీరు అన్నది “క(ఖ)ర్మ” అని కదా?
కర్మ ఐనా, ఖర్మ ఐనా ఎవరు చేసుకున్నది వారికే ఉంటుందిగానీ దానితో సుజాతగారికి ఎటువంటి సంబంధమూ లేదని నా వ్యాఖ్య ఉద్దేశం.
>> ఈ గడిలో నేను కూర్చిందీ లేదు, పేర్చిందీ లేదు.
ఏమో, కుట్రదారులతో కలిసినవారు, మిమ్మల్నెలా నమ్మడం?
దైవానిక గారూ!
4 అడ్డం: ఆధారంలోనే ఉందిగా “ఊరంత” అని. ఆ ఊరేదో మీకు తెలుసు. (4 నిలువు తెలుసు కాబట్టి) ఇక మిగిలింది కాపుగాసే “సంసారం”. 7 నిలువు కోసం కొమ్ము విరిగినా పట్టించుకోకండి.
4 నిలువు: కొ.పా., దైవానిక గార్లిచ్చిన స్లిప్పులతో తెలిసిపోయిందోచ్!
19 అడ్డం: కొ.పా., దైవానికలకు నెనరులు.
ఎలాగూ కూర్పరులలో ఒకరైన కొత్తపాళీగారు స్లిప్పులు ఇచ్చెస్తున్నారుగా – మళ్ళీ మమ్మలని అనడం దేనికో?
ఆయనిచ్చారు కాబట్టి, నేనూ ఓ స్లిప్పు ఇస్తున్నా:
ఇప్పటిదాకా నలుగురు సమధానాలు పంపారు, కాని పంపినవాళ్లందరూ 19 అడ్డంలో ఒక అక్షరం దగ్గర పప్పులో కాలేస్తున్నారు. ఆధారం ప్రకారం ఉన్నది రాముడి రక్ష, రాముడు కాదు – పరిశీలించండి.
ఇంతకీ ఇక్కడ ఇలా అందరూ కబుర్లు చెప్పుకొంటున్నారుగాని, ఒక్కరూ సమాధానాలు పంపరేం?
అందరికీ అభినందలతో,
సిముర్గ్
అయ్యా సిముర్గ్ గారు,
పంపడానికి అవ్వాలి కదా!!
సుగాత్రి నెనర్లు, కొమ్ము విరగకుండా ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాఇన్నాళ్ళు .. మొత్తానికి 4 అడ్డం వచ్చేసింది. ఇక మిగిలింది 6 నిలువు. ఏదొ వచ్చినట్టే ఉంది. కాని కుదిరినట్టు లేదు. అది కాక 19 అడ్డానికో ట్విస్ట్ ఇచ్చారు పొద్దు సారు..
నాకు 20 అడ్డానికి ఒక స్లిప్పిచ్చుకోండి. చూస్తే, ఆదిత్యుడిలాగున్నాడు.
సుగాత్రి గారు,
20 అడ్డం వచ్చిందండోయ్, కాని 6 నిలువే అన్ని కలిసాక పదంలా లేదు
6 నిలువు నులువునా ముంచుతోంది, స్లిప్పు ఇద్దురూ
19 మిగతా మూడూ అండగా ఉన్నా, రెండు అక్షరాల్లో శ్రీరామరక్షా ఏంటబ్బా?
19 — కోదండమా లేక రామదండా? ఈ రెంటిలో ఒకటని చెప్పండి పెద్దలూ, లేకపోతే నేను చేతులెత్తేసినట్లే..
[...] నలభై యాభై దాకా ఉండొచ్చు. సుగాత్రి తమ గడువెళ్ళీ పోతోందిరా జాబు ద్వారా వ్యాఖ్యల రికార్డు [...]
@ సిముర్గ్: మిమ్మల్ని కుట్రదారులన్నది మేం కాదు, కొత్తపాళీ గారే!
రాముడి రక్ష అంటే (3,2) కదండీ? చివర్లో అక్షరాలు తడబడ్డాయా? ఆధారంలో అలాంటి సూచనేమీ లేదే?
రెండూ కాదు. నిలువులను బట్టి చూస్తే ‘రాము’ తో మొదలవ్వలి. అక్కడిదాకా వచ్చి ఇక రానని ‘మారాము’ చేస్తోంది.
19 అడ్డం వచ్చేసిందనే అనుకున్నా, మళ్ళీ మీరేదో మెలిక పెడుతున్నారే?
పూర్తవనివ్వండి అలాగే పంపిస్తాం.
నెనర్లు.
@దైవానిక: 6 నిలువుకు కింద వికటకవిగారికిస్తున్న స్లిప్పు మీరూ అందుకోండి.
@వికటకవి: 6 నిలువుకు సుజాతగారైతే బ్రహ్మాండమైన స్లిప్పులిచ్చేవారు. మీకోసం నేను ప్రయత్నిస్తాను: డిజీగారు ‘కామా’తో మొదలుపెట్టి, మ’రపు’ చేత ‘జీడి’పాకం అంటించుకున్నారు.
19 అడ్డం: అదేకదా అందరి సమస్యా?
సుగాత్రి గారు, థాంకులు. 6 నిలువులో తికమక ఉందని క్లూ కూడా ఇవ్వలేదు పొద్దుసార్లు. సమాధానం ఎదుటే ఉన్నా తెలియని పరిస్థితి. బహుశా ప్రజలు తెలివి మీరుతున్నారనేమో
19 అడ్డానికి 3 నిలువు వల్ల “రాము” లేదా “రామే” కూడా అవొచ్చునేమో కదా ప్రశ్నార్ధకంగా చూస్తే. అయినా క్లూ దొరకలేదనుకోండి.
క్షమించాలి, “రామా” తో ప్రశ్నార్ధకం. కానీ “రామే” కూడా అవకాశముంది కదా.
అందరు సైలెంట్ అయ్యారు పంపేసారా. నాకు ఇప్పుడే పూర్తయింది. ఎవరికన్నా స్లిప్పు కావాలంటే అడగండి.
సుగాత్రి గారు, వచ్చే గడికి వేరే పేజి ఓపెన్ చేయండి.
వికటకవి గారు, జ్యోతి గారు,
గడి ఫలితాలు విడుదలయ్యాయి. అందరి సందేహాలూ తీరిపోయి ఉంటాయని ఆశిస్తాను. నేనైతే కొన్ని సమాధానాలు చూసి నాలుక తెగేదాకా కొరుక్కోవలసి వచ్చింది.
కొత్తగడి కూడా వచ్చేసింది. మీ సూచనల మేరకు కొత్తగడి మీద కొత్తటపా మొదలుపెడతాను.