పొద్దులో గతంలో సత్యసాయి గారు కూర్చిన గడికి విశేష స్పందన లభించింది. పాఠకులందరూ ఉత్సాహంగా పూరించి పంపారు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సత్యసాయి గారు కూర్చిన గడి ఇప్పుడొచ్చింది. ఎంతమంది ప్రయత్నించారో, వారిలో ఎంతమంది పంపించారో తెలియదు. పోయిన్నెల్లో లా కాకుండా ఈ గడి గురించి ఎక్కడా గుసగుసలైనా వినబడడం లేదు. బహుశా పొద్దు పెద్దలు “మాస్ కాపీయింగ్” అంటారని జంకుతున్నారేమో తెలియదు.
ఏమైతేనేం? ఈసారి పిల్లి మెడలో గంటకట్టే అవకాశం నాకొచ్చింది. గడి గడువు కూడా దగ్గరపడుతోంది కాబట్టి కట్టేస్తున్నా.
ముందుగా ఇవి ‘చెప్పాలని ఉంది’! (కశ్యప్ గారిలా కబుర్లు కాదండోయ్!):
అడ్డం:
28. పేరులో ఈశ్వరుడున్నాడు కానీ ఆగర్భశ్రీమంతుడు. అందుకే దాక్కున్నాడు. (6)
నిలువు:
33. విష్ణుమూర్తే. ముందే విష్టా ఉన్నవాడు. తర్వాతే చెవి ఉన్నవాడు. (6)
ఈ రెండు ఆధారాలకూ సమాధానాలు బ్రౌణ్యములోనే దొరుకుతాయి తెలివిగా వెదికితే! (నాకు దొరికాయని భావము.
)
(ఈ బ్లాగులో టపాలు రాసి చాలాకాలమైంది. కూడలిలోంచి గెంటేస్తారేమో అని అనుమానించి ఇలా టపా కట్టేశా!)
బాబ్బాబు, పుణ్యవుంటుంది, ఇన్విజిలేటర్లకేంఇ పని, వాళ్ళేమైనా అనుకుంటారు, కాస్త స్లిప్పులిచ్చి పుణ్యం కట్టుకోండి.
ఒక్క క్లూ కూడా తట్టక కొట్టుకుంటున్నాను!
కొత్తపాళిగారు, ఇక్కడ చెప్తే పొద్దు వారు నన్ను మళ్ళీ గడిలోకి రాకుండా డిబార్ చేస్తారని. మీకు మెల్లిగా కొన్ని స్లిప్పులు మెయిల్ లో పంపా చూడండి. అవి సరియైనవి ఐతే మిగతావి రాయడం మీకు కష్టమేమి కాదు. ఆల్ ద బెస్ట్.
ముందుగా గడిని సజీవంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన ఆధారాలు బ్రౌణ్యం చూస్తోంటే దొరికినవే. ఎవరూ ఇప్పటిదాకా గడి నింపి పంపినట్లులేదు.
కొత్తపాళీ గారూ!
మీరు కడు చమత్కారులు.
జ్యోతి గారూ!
మీకు ఇన్విజిలేటర్లను మాయచేయడం బాగా వచ్చు. “నేను కాపీలందిస్తున్నానోచ్!” అని పబ్లిగ్గా ప్రకటించేశారుగా?
కొవ్వలి గారూ!
ఈసారి గడిని ఎక్కువమంది నింపి పంపగలరని ఆశిస్తున్నాను. పొద్దు పెద్దలెవరూ ఈసారి నోరువిప్పడం లేదు ఎందుకనో?
చూడు సుగాత్రి గారు…మీరు నా బ్లాగు లో తప్పు లు చూపుతున్నారు…..కాని ఒకటి గమనించాలి….నా బ్లాగు ఎవరికి జవాబుదారి కాదు….ఈనాడు పేపరు 13 లక్షల వినియోగదారులకు జవాబుదారి కదా….నాకు తెలుసు నా బ్లాగు లో అక్కడక్కడా తప్పులు దొర్లుతున్నాయని……ధన్యవాదములు TVBHASCAR@GMAIL.COM
ఇక ఐదే ఐదు ! అన్నీ వచ్చేసాయి! ఎవరైనా వీటికి స్లిప్పులిస్తే , ముందు నేనే పంపేస్తా గడి పూరించి.
28 అడ్డం
19 నిలువు
33 అడ్డం
29 నిలువు (28 అడ్డం వస్తే , ఇదీ వస్తుంది)
4 అడ్డం (దీనికి సగం అక్షరాలు కలిసాయి)
ఇవిగో 2 స్లిప్పులు
20 అడ్డం..! ‘వాణి నా రాణి ‘ అన్నాడీయన. శివుడి అనుచరుడే!
43 పెద్ద శబ్దం
@VIJAYABHASKAR – మీరిక్కడ ఇచ్చిన మీ బ్లాగు లింకులో కూడా ఏదో అచ్చుతప్పు దొర్లినట్టుంది, చూడండి. బ్లాగ్ నాట్ ఫౌండ్ అంటోంది.
43 అడ్డం నాకు తెలిసిపోయిందిగానీ.. బహిరంగంగా చెప్పెయ్యొచ్చా అనే ఒక శంకా, సున్నాని ఒక ప్రత్యేక అక్షరంగా గుర్తించమని అనేస్తారేమోనన్న బెంగ ఒక వంకా నన్ను పట్టుకుని లాగేస్తున్నాయి. లేకపోతే చెప్పేద్దును. మీరు సరేనంటే చెప్పేస్తాను.
- విధేయుడు, శేషాచలపతి
@సుజాత:
మీరిచ్చిన స్లిప్పులు గడికి దీటుగా ఉన్నాయి.
28 అడ్డం: పక్షీంద్రుడు పేరుకు రాజైనా విష్ణుమూర్తికి బంటేనటండీ, పోతరాజు చెప్పాడు.
33 అడ్డం: “రోములో ఉన్నప్పుడు రోమంగాడిలా పలకమన్నారు” కదా? ఇంతకంటే ఎక్కువ చెప్తే ఎంత టీ తాగుతున్నా ఇన్విజిలేటర్లు ఊరుకోరేమో!
28, 33 అడ్డం వస్తే 19 నిలువు వచ్చినట్లే కదా?
అలాగే 29 నిలువు కూడా!
4 అడ్డం: “కవిత్వపు తోటని దున్నడంలో అబ్బూరివారి కెంత తహతహో” ఇదేదో నాకూ తెలియడం లేదండీ. అబ్బూరివారి పేరు చెప్పి గూగులమ్మను అడిగి చూడండి. విజయోస్తు!
విజయభాస్కర్ గారూ!
“నా బ్లాగు ఎవరికి జవాబుదారి కాదు…” అనడం సరికాదు. మీరు అలా ఎందుకనుకుంటున్నారో కూడా నాకు తెలియదు. ఒకసారి బ్లాగరుల ప్రవర్తనా నియమావళి చదవండి. పత్రికల్లోని అచ్చుతప్పులను “భాష ఖూనీ ఐపోతోందని”మీ బ్లాగులో ఎత్తిచూపుతున్నారు కాబట్టి మీ బ్లాగుపాఠకులు సహజంగానే మీ బ్లాగులో అచ్చుతప్పులుండవని ఆశిస్తారు. ఒత్తులు, దీర్ఘాల విషయంలో అనుమానమున్నవారు మీరు రాసేదే సరైన స్పెల్లింగు అని కూడా నమ్ముతారు. ఈ రకంగా మీ బ్లాగులోని అచ్చుతప్పుల వల్ల కూడా భాష ‘ఖూనీ’ అయ్యే ప్రమాదముంది.
అచ్చుతప్పుల కంటే ఎక్కువగా భాష ఖూనీ అయ్యేది అపప్రయోగాల వల్ల. మహా మహా చెయ్యితిరిగిన రచయితలే “రమ్మని” బదులు “రమ్మనమని” అని రాస్తారు. ఇటీవల వార్త లాంటి పేపర్లలో వాక్యనిర్మాణంలో దారుణమైన తప్పులు దొర్లుతున్నాయి. ఒక ఉదాహరణ: direct speechలో ‘నేను’ బదులు ‘తాను’ అని రాయడం. ఇదెలా ఉంటుందంటే:
“తాను తప్పు చేశాను.” అని హర్భజన్ అంగీకరించాడు.
మీరు ఇలాంటివాటి గురించి కూడా రాస్తే మరీ బాగుంటుంది. నా వ్యాఖ్యకు సమాధానమిచ్చినందుకు నెనర్లు!
చదువరి గారూ! విజయభాస్కర్ గారి బ్లాగు http://achhutappu.blogspot.com. ఆ బ్లాగులో ఇప్పుడు పాఠకులు వ్యాఖ్యలు రాసే వీలు లేకుండా చేశారు.