నాటకం రవీంద్రభారతనే ఐ.సి.యు.లో ఊపిరి తీస్తోంది భారంగా. ఐనవారికోసం కబురంపాం.
నవల కమర్షియల్ వలలో చిక్కి శల్యమైంది. తాను రాలేనంది.
కవిత నీ’రసం’తో కలిపి పది రసాలు తెచ్చింది.
కథ ముస్తాబై ఖంగారుగా వచ్చింది.
సాహిత్యం
మే 14, 2007 సుగాత్రి చే
మే 14, 2007 సుగాత్రి చే
నాటకం రవీంద్రభారతనే ఐ.సి.యు.లో ఊపిరి తీస్తోంది భారంగా. ఐనవారికోసం కబురంపాం.
నవల కమర్షియల్ వలలో చిక్కి శల్యమైంది. తాను రాలేనంది.
కవిత నీ’రసం’తో కలిపి పది రసాలు తెచ్చింది.
కథ ముస్తాబై ఖంగారుగా వచ్చింది.
దీనికి టైటిలు “సంతాప సభ” అని పెట్టండి
నవ్వుకోటానికి బానే ఉంది గానీ, తెలుగు సాహిత్యం పరిస్థితి బానే ఉందని నా నమ్మకం.
కొత్తపాళీ గారూ!
మొత్తమ్మీద చూస్తే తెలుగు సాహిత్యం పరిస్థితి మీరన్నట్లు బానే ఉంది. చెత్త కథలు, చెత్త నవలలతో బాటే మంచి కథలు, మంచి నవలలు కూడా వస్తూనే ఉన్నాయి. వాటిని ఏరుకోవడమే పెద్దపనిగా ఉంది. అలాగే కవితల్లో పది రసాలొలుకుతున్నాయని నేను బలంగానే నమ్ముతున్నాను. కానీ నాటకం పరిస్థితే అస్సలు బాలేనట్లుంది. ఎంత వెదికినా మంచి నాటకాలు అసలు రావడం లేదు. తెలుగులో గొప్పనాటకాల పేర్లు చెప్పమంటే వందేళ్ళ కిందటి కన్యాశుల్కం పేరు చెప్పి, తర్వాత తడుముకోవలసి వస్తోంది. ఏమంటారు?
పట్నాల్లో వారికి తెలియకపోవచ్చుగానీ, పల్లెల్లో నాటకాలు ఇప్పటికీ ఉన్నాయి. మా ఊరి దగ్గర పల్లెల్లో ఏ సందర్భం వచ్చినా సాసవుల చిన్నమ్మ లాంటి నాటకాలు వేస్తారు.
పొద్దులో మొదటి సంచికల్లో సినిమా గురించి సాధికారంగా చక్కటి వ్యాసాలు రాసింది మీరేనని ఇప్పుడే గమనించాను. దయచేసి ఆ వ్యాసాలు కొనసాగించండి. అలాగే సినిమాలు, నాటకాల గురించి బ్లాగడం మొదలెడితే కూడా బాగుంటుంది.
మీరెందుకు కొత్త టపాలు రాయడంలేదు?
కొత్తపాళీ గారూ!
మీలాంటి పెద్దలు, పండితులు అచేతనంగా పడి ఉన్న నా బ్లాగును గుర్తుపెట్టుకుని, నేను రాసే టపాల కోసం ఎదురుచూస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. నాకు కూడా తరచుగా రాయాలనే ఉంది కానీ సమయాభావమే పెద్ద సమస్య. ఇకమీదట తరచుగా బ్లాగడానికి ప్రయత్నిస్తాను.
i am also one of the telugu songs writer.