75 సంవత్సరాల తెలుగు సినిమా పండుగ సందర్భంగా వెండితెర వేలుపులనే కాకుండా చిత్ర నిర్మాణంలోని అన్ని శాఖలకు చెందినవారిని సన్మానించారు. ఇది అభినందనీయం. ఐతే వాళ్ళెవరో, వాళ్ళ ఘనతేమిటో వాళ్ళ పేర్లైనా విని ఉండని ప్రేక్షకులకు పరిచయం చెయ్యడం అవసరమని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పిన తర్వాతైనా నిర్వాహకులు భావించలేదంటే ఇది కొందరు ప్రముఖులు కలిసి సొంతడబ్బా కొట్టుకోవడానికి ఏర్పాటుచేసుకున్న కార్యక్రమమా అనిపించక మానదు. ఎవరి గురించైతే ప్రేక్షకులకు ఎక్కువగా తెలుసో వారి గురించే మరీ ఎక్కువ డబ్బా కొట్టారు. తెలియనివాళ్ళ గురించి అసలు చెప్పనేలేదు. బాపు గారి సినిమాల్లోంచి కొన్ని క్లిప్పింగులను చూపించారు. ఆయన తీసిన సాక్షి సినిమా చిత్రీకరణలో ఒక విప్లవాన్నే తీసుకొచ్చింది. దాంట్లోంచి గానీ, ఆయనకు ఘనకీర్తి తెచ్చిపెట్టిన సంపూర్ణరామాయణం నుంచి గానీ ఒక్క క్లిప్పింగైనా చూపలేదంటే ఎంత చిత్తశుద్ధితో చేశారో అర్థమౌతుంది.
అంతేగాక చిత్రసీమ ఎన్టీరామారావు, ఏయెన్నార్ ల కాలం నుంచే మొదలైనట్లు, అంతకు ముందు వచ్చిన సినిమాలనుగానీ, అప్పటి మహానుభావులనుగానీ స్మరించనైనా లేదు. డెబ్భై ఐదేళ్ల సినిమా పండుగలో మొదటి పాతికేళ్ళను పూర్తిగా విస్మరించడం అత్యంత దారుణమైన విషయం. ఈ పండుగలో ఒక్క ఎన్టీయార్ తప్ప పోయినోళ్ళనెవరినీ నిర్వాహకులెందుకు గుర్తుచేసుకోలేదో అర్థం కాకుండా ఉంది.
సినిమాలో ప్రధానాకర్షణ పాటలు. గాయనీగాయకుల్లో పోయినోళ్లనొదిలేసినా లివింగ్ లెజెండ్స్ సుశీల, జానకి, రావు బాలసరస్వతి లాంటి గాయనీమణులను తలచుకున్న నాథుడేడీ? దీనికి కారణం చిత్రసీమలో రాజ్యమేలుతున్న గ్లామరా, పురుషాధిక్యధోరణా లేక కేవలం నిర్లక్ష్యమా? కారణమేదైనా క్షమించరానిదే. హీరోయిజమ్ గల పాత్రలను పోషించి మెప్పించిన హీరోయిన్ విజయశాంతి, సోగ్గాడు శోభన్ బాబు లాంటి మరికొందరు ప్రముఖులూ దీనికి దూరంగానే ఉన్నారు.
రాజేంద్ర ప్రసాదు అంజలీదేవిని తొలితరం స్టార్ గా అభివర్ణించడం తెలుగుసినిమా చరిత్ర తెలియకనా? “తొలితరం” సినిమాలను, అవి తీసినవారిని గుర్తుచేసుకోవాలంటే చాలా సాహసం కావాలి. ఎందుకంటే తొలి ఇరవయేళ్ళ తెలుగుసినిమా సాధించిన ఘనత అలాంటిది. సినిమా అంటే వెకిలిచేష్టలతో కూడిన చౌకబారు వినోదసాధనంగానో, డబ్బులుచేసుకునే సాధనంగానో గాక చిత్రనిర్మాణాన్నొక తపస్సుగా భావించి సంఘసంస్కరణాభిలాషతో తీసిన అప్పటి సినిమాలు గుర్తొస్తాయి. అప్పటి (వీటిలో కొన్ని ఇప్పటికి కూడా వర్తిస్తాయి) సామాజిక సమస్యలైన అస్పృశ్యత (మాలపిల్ల), జమీందారీ వ్యవస్థ (రైతుబిడ్డ), బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు (సుమంగళి, మళ్లీపెళ్ళి), వేశ్యావ్యామోహం (స్వర్గసీమ)…ఇలాంటి సినిమాలు ఎక్కువగా తీసిన కాలమది. ఇవన్నీ సగటున సంవత్సరానికి పట్టుమని పది సినిమాలైనా రానిరోజుల్లోనే! 75 సంవత్సరాల తెలుగు సినిమా పండుగ జరుపుకునే ఆనందసమయంలో ఆ కాలపు సినిమాలను, వాటిని తీసిన దార్శనికులను గుర్తుచేసుకుంటే దారీ తెన్నూలేని ప్రస్తుత తెలుగు సినిమా పరిస్థితి తలపుకొచ్చి దు:ఖం కలుగుతుంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?” అని ఆత్మపరిశీలన చేసుకోవలసొస్తుంది. ఆ దమ్మూ ధైర్యమూ లేవు కాబట్టే నిర్వాహకులు తొలి తరం సినిమాను విస్మరించారా?
మంచి వ్యాఖ్యానం.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వజ్రోత్సవ వేడుకలలో వజ్రపు వెలుగులన్నీ పాత తరానివే. ఇప్పుడు అంతా అభ్రకం స్థాయిలో ఉంది. బొంబాయి బొమ్మలు, బొంబాయి గాత్రాలు, బొంబాయి కాస్ట్యూములు ఒకటేమిటి అంతా అరువే…
మనకి దిగ్గజాలన్నా, అద్భుతాలనా మగాళ్ళే ! భానుమతిని లాంటి విదుషీమణిని వదిలేసారు. జానకి, సుశీల మాట సరే సరి. జయసుధ, జయప్రదలు దిగ్గజాలు కారా? వారు నటించిన పాత్రల ముందు ఈ తరం బుర్ర కొట్టుకున్నా నిలబడలేదు.
ఈ రంగస్థలాన్ని అలంకరించిన విజ్ క్రాఫ్ట్ వారికి అంతకంతే బుర్ర లేదు. ఒక LV prasad చిత్రం లేదు, BN reddy, chakrapani లు లేరు, విఠలాచార్య లేరు, ఘంటశాల చిత్రం లేదు. ఇంత కంటే బాగా TV పాటల ప్రొగ్రాం Meri Awaz Suno stage బాగా ఉంది.
బాగా చెప్పారు.
–ప్రసాద్
http://blog.charasala.com
ఎక్కువ ప్రింట్లతో థియేటర్లను ముంచెత్తి వారంలోగా సొమ్ముచేసుకోగలగడమే లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత సినీసంస్కృతిలో తొలితరం సినిమాలను గుర్తుచేసుకోవడానికి మీరన్నట్లు చాలా సాహసం కావాలి. ఈ వజ్రోత్సవం చాలా నిరుత్సాహాన్ని కలిగించింది. పాతతరంలోని గొప్పవాళ్లను గౌరవించే సంప్రదాయం పాటించని ఏ ఉత్సవమైనా ఇంతే.
మోహన్‌బాబు ఏ వుద్దేశంతో మాట్లాడినా ఈ ఉత్సవాలు కేవలం మూడు నాలుగు “సినీ రాజవంశాలకి” పరిమితమైనవనే దాంట్లో సందేహం లేదు. అందుచేత పనిగట్టుకుని పాతవారందరినీ విస్మరించారు. ముఖ్యంగా NTR ANR ఇంతటివారు కావడానికి దోహదించిన ఘంటసాలగారిని వారిని పైకి తెచ్చిన వేదాంతం రాఘవయ్య సి.పుల్లయ్య మొదలైనవారందరిని కట్టగట్టి అవతల పారేశారు.తొలితరం తెలుగు హీరోలైన రామానుజాచార్యులు చిత్తూరు నాగయ్యగార్ల ఊసే లేదు. ఈమధ్య దాకా బ్రతికే ఉన్న మహానటి సౌందర్యగారిని మరిచిపోయారు. కళ పేరుతో వ్యాపారం/వ్యభిచారం చేసే వారినుంచి ఇంతకన్న గొప్ప ట్రీట్మెంటు ఆశించడం మనదే బుద్ధితక్కువ.
Hi all, i´m from Perú, me too have blog. This blog is cool…
శోధన, చరసాల, రానారె, సుబ్రహ్మణ్యం గార్లకు,
ఆవేశంలో రాసేసిన నా బ్లాగుకు వచ్చి ప్రోత్సాహకరంగా వ్యాఖ్యలు రాసినందుకు ధన్యవాదాలు. మీరు రాసినవన్నీ అక్షరసత్యాలే! (నేను సాధారణంగా మెయిల్స్ చూసుకోను. నా ఆలస్యానికి మీరు మన్నించాలి.)
hi
manchi vimarsalu.
Actually my age is very young to comment this vajrothsavalu’ but i want to share my feellings with you sir
Really these are not vajrothsavalu , these are one kind of selftelling of up comming changes in political situations
lalitha
In 75 yrs vajrotsavam nobody remembered s.v.rangarao,kantharao, jamuna, haranath ,chalam.
Ihave not seen urvashi sarada,sobhan babu,ranganath,jayachitr,jayanthi ,jayalalitha,bhanupriya,sridevi{sr},singer ramakrishna,g.srinivas, music directors,old lyric writers
This is very ridiculos to see they have not tributed “savitri”,kannamba,peketi sivsram, csr,mukkamala,rajanala.
mohan babu only criticiszing chiru only, but how they are forgotted the history to remember this occasional time.
IT’S AGOOD PROGRAM